ఇస్లాం మతం వద్దు: ప్రజలకు చైనా హెచ్చరిక
బీజింగ్: ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకొని, చైనా అధికారిక విధానమైన మార్కిస్ట్ నాస్తిక వాదానికి దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని అధినాయకత్వం సూచించింది. ముఖ్యంగా కల్లోలిత జింజియాంగ్ ప్రావిన్సులో ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకోవాలని సూచించింది.
చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రజలకు ఈ హెచ్చరిక రావడం వివాదానికి తావిస్తోంది. జింజియాంగ్ ప్రొవిన్సులో ఈ సూచనల ప్రభావం అధికంగా కనిపించాలని చైనా భావిస్తోంది. ఈ అంశంపై జీ జిన్‌పింగ్ ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు.

జింజియాంగ్ ప్రాంతంలో రోజురోజుకీ పెరుగుతోన్న అతివాదం దృశ్యా ఆ ప్రాంతంలో మార్క్సిస్ట్ నాస్తిక భావజాలాన్నే పాటించాలంటూ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడి విఘర్ అతివాద సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, జింజియాంగ్ ప్రాంతంనుంచి తమ ప్రభుత్వానికి నిరసనలు వ్యక్తం అవుతుండడంతో కమ్యూనిస్ట్ పార్టీ నాస్తిక వాదాన్నే పాటించాలంటూ హెచ్చరికలు చేసింది.












Click it and Unblock the Notifications