వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అయితే, అది సహజంగా పుట్టిందా లేక అక్కడి ల్యాబ్‌లో సృష్టించారా? అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాతోపాటు పలుదేశాలు ఇప్పటికే ఈ విషయంలో చైనాను నిందిస్తున్న విషయం తెలిసిందే.

కరోనావైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాటకరోనావైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాట

సృష్టి కాదంటూనే..

సృష్టి కాదంటూనే..

ఈ నేపథ్యంలో వూహాన్ ల్యాబ్ వర్గాలు కరోనావైరస్ సృష్టిపై మొదటిసారిగా స్పందించాయి. కరోనావైరస్ ల్యాబ్‌లో సృష్టించింది కాదని స్పష్టం చేశాయి. అయితే, ఈ వైరస్ పుట్టుకపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. ఈ మేరకు వుహాన్ ల్యాబ్ రాయిటర్స్‌కు తెలిపింది.

చైనాపై నిందలు..

చైనాపై నిందలు..

వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూవీ)లో సృష్టించబడిన కోవిడ్-19(సార్స్ కోవ్-2) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందిపైగా ప్రాణాలు కోల్పోయారని అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే, కరోనావైరస్ ల్యాబ్‌లో సృష్టించింది కాదని, సహజంగా పుట్టుకొచ్చిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వుహాన్ నగరంలోని ల్యాబ్‌లోనే పుట్టిందా? లేదా? అనే విషయం తేల్చేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా అధికార వర్గాలు విచారణను ఇప్పటికే ప్రారంభించాయి.

వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త ఏమన్నారంటే..?

వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త ఏమన్నారంటే..?

కాగా, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూవీ) ప్రొఫెసర్, నేషనల్ బయో సేఫ్టీ డైరెక్టర్ యువాన్ జిమింగ్ కరోనావైరస్ సృష్టిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కరోనావైరస్ ల్యాబ్‌లో సృష్టించబడలేదని, ఇందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని అన్నారు. అంతేగాక, కొత్త వైరస్‌ను సృష్టించే ఉద్దేశం కానీ, సామర్థ్యం కానీ వుహాన్ ల్యాబ్‌కు లేదని స్పష్టం చేశారు. సార్స్-కోవ్-2 జన్యువులో ఇది మానవ నిర్మితమైనదని సూచించే సమాచారం కూడా లేదని వెల్లడించారు. వైరస్ సృష్టించే ప్రయత్నమే జరగలేదని, సిబ్బంది రక్షణ కోసం ప్రయోగాల సందర్భంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !
 కరోనా మూలాలపై మాత్రం స్పష్టత?

కరోనా మూలాలపై మాత్రం స్పష్టత?

కాగా, చాలా మంది శాస్త్రవేత్తలు కూడా కరోనావైరస్ గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి వ్యాపించిందని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చిన సైంటిఫిక్ పేపర్ కూడా ఈ మేరకు స్పష్టం చేశాయి. బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం చైనాపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, అభివృద్ధి చెందిన వైరస్‌లన్నీ 70శాతానికిపైగా జంతువులు, అడవి జంతువుల నుంచే వ్యాపిస్తున్నాయని యువాన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వాతావరణం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోందని తెలిపారు. అయితే, కరోనా వైరస్ పుట్టుక మూలాలపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తెలిసిన ఏడు మానవ కరోనావైరస్లకు గబ్బిలాలు, ఎలుకలు లేదా పెంపుడు జంతువులలో మూలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

English summary
Conspiracy theorists have claimed SARS-CoV-2, now responsible for more than 200,000 deaths worldwide, was synthesised by the Wuhan Institute of Virology (WIV), based in the city where the disease was first identified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X