వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటి స్కైలాబ్: నిప్పులు చిమ్ముకుంటూ.. మాల్దీవుల సమీపంలో: కూలిన 18 టన్నుల చైనా రాకెట్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తాన్ని వణికింపజేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ నేల రాలింది. ఏ నగరం మీద పడుతోందో.. ఎక్కడ జనావాసాల మీద కుప్ప కూలుతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. 80వ దశకంలో ప్రపంచాన్ని ఇదే తరహాలో భయపెట్టిన స్కైలాబ్ ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చింది. తాజాగా నేల రాలిన ఈ చైనా రాకెట్ వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 18 టన్నుల బరువు ఉన్న ఆ రాకెట్ హిందూ మహా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని చైనా అంతరిక్ష ప్రయోగాల సంస్థ ధృవీకరించింది.

Recommended Video

Chinese Rocket ఎట్టకేలకు కుప్పకూలింది... Indian Ocean లో నిప్పులు చిమ్ముకుంటూ..!! | Oneindia Telugu

ఆ చైనా రాకెట్ పేరు- లాంగ్ మార్చ్ 5బీ (Long March 5B). కిందటి నెల 29వ తేదీన ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించారు చైనా శాస్త్రవేత్తలు. భూ కక్ష్యలో కొత్తగా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో భాగంగా దాన్ని పంపించారు. అది గతి తప్పింది. నియంత్రణ కోల్పోయింది. భూమిపైకి దూసుకొచ్చింది. ఎక్కడ పడుతుందో తెలియని పరిస్థితిని కల్పించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా న్యూజీలాండ్, నార్వే వంటి దేశాల్లో ఏ నగరంపై పడుతుందో అంతుపట్టలేదు శాస్త్రవేత్తలకు. భూమిపై 70 శాతం మేర నీరు ఉండటం వల్ల సముద్రాల్లో కుప్పకూలడానికే అవకాశం ఉంటుందని చైనా అంతరిక్ష పరిశోధకులు ముందు నుంచీ చెబుతూ వచ్చారు.

Chinas biggest rocket landed in the Indian Ocean, with the bulk of its components destroyed

వారి అంచనాలకు అనుగుణంగా లాంగ్ మార్చ్ 5బీ యావో-2 రాకెట్.. హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. హిందూ మహాసముద్రం గగనతలంపై, భూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన వెంటనే అది ముక్కలుగా పేలిపోయిందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాలయం ధృవీకరించింది. హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల సమీపంలో ఇది కుప్పకూలిందని ప్రకటించింది. సముద్ర ఉపరితలానికి సమీపించిన సమయంలో ఇది సాధారణ కంటికి కనిపించినట్లు పేర్కొంది. నిప్పులు చిమ్ముకుంటూ.. వాటి శకలాలు భూమి వైపునకు దూసుకుని రావడానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

English summary
A large segment of a Chinese rocket Long March 5B re-entered the Earth's atmosphere and disintegrated over the Indian Ocean on Sunday, the Chinese space agency said, following fevered speculation over where the 18-tonne object would come down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X