చైనా- పాకిస్థాన్ మాస్టర్ స్కెచ్.. భారత్ అలెర్ట్..!
చైనా- పాకిస్థాన్ మధ్య అంతరిక్ష ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ మిషన్ లో భాగంగా చైనాకు చెందిన మానవ సహిత స్పేస్ ఏజెన్సీ(CMSA)లో పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు సంవత్సరం పాటు అంతరిక్ష రంగంలో శిక్షణ ఇవ్వనుంది. ఈ ట్రైనింగ్ అక్టోబర్ 2025 లో ప్రారంభం కానుంది. ఈ వ్యోమగాములు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకోనున్నారు. 2026 లో చైనీస్ స్పేస్ స్టేషన్ వారం రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపే కార్యక్రమానికి వీళ్లను సిద్దం చేయనుంది.
ది స్పేస్ అండ్ అప్పర్ అట్మోస్పియర్ రీసెర్చ్ కమిషన్(సుపార్కో) ఈ మేరకు ప్రొపోజల్స్ ను కోరింది. ఈ మిషన్ లో భాగంగా సైంటిఫిక్ పరిశోధనలు చేయనున్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా 300 లకు పైగా పరిశోధనలు షార్ట్ లిస్ట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన వ్యోమగాములకు బయాలజీ, మెడికల్ సైన్సెస్, అప్లయిడ్ ఫిజిక్స్, ఏరోస్పేస్, ఆస్ట్రోనమీ పై పరిశోధనలు చేయనున్నారు.
ఈ మిషన్ లో భాగంగా మెడికల్ స్టడీస్, ఎన్విరాన్ మెంటల్ స్టడీస్, స్పేస్ టెక్నాలజీలో పాకిస్థాన్ శాస్త్రవేత్తలకు నైపుణ్యం అందించనున్నారు. పాకిస్థాన్- చైనా స్పేస్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కీలక రంగాల్లో పరిశోధనలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ స్పేస్ సెంటర్ ఏర్పాటుతో పాటు లూనార్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ ప్లొరేషన్ చేయనుంది. చైనా సాయంతో అంతరిక్ష రంగంలో పరిశోధనలు జరిపి నైపుణ్యం సాధించి భారత్ పై నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ యత్నిస్తోంది.

గతంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ పై పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులను, డ్రోన్ లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పాకిస్థాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. ఇక ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా సరఫరా చేసినవే. గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్థాన్ తన ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది.












Click it and Unblock the Notifications