వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిత్తులమారి చైనా: చర్చలంటూనే గల్వాన్ నదిపై కన్ను, బుల్డోజర్లు, వాహనాల మోహరింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాము శాంతిని కోరుకుంటున్నామని, చర్చల ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటామంటూనే చైనా తన జిత్తులమారి వేషాలు వేస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్న సమయంలో దాడులకు పాల్పడి 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఈ డ్రాగన్.. మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది.

గాల్వన్ నది వెంట బుల్డోజర్ల మోహరింపు..

గాల్వన్ నది వెంట బుల్డోజర్ల మోహరింపు..

లడఖ్ ఈశాన్య ప్రాంతంలోని గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుతగిలే విధంగా చైనా ప్రయత్నాలు ప్రారంభించింది వందలాది బుల్డోజర్లను ఈ ప్రాంతానికి తరలించి అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వందలాది బుల్డోజర్లను గాల్వన్ నది వెంబడి కిలోమీటర్ల పొడవునా మోహరించిన విషయం ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. వందలాది సైనిక వాహనాలు కూడా మోహరించినట్లు తెలుస్తోంది.

ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడిఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడి

చర్చలంటూనే..

చర్చలంటూనే..


సరిహద్దు ఘర్షణల అనంతరం బుధవారం మేజర్ జనరల్ స్థాయి అధికారులు చైనా అధికారులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్చలు ఫలించలేదు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రితో కూడా ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దాడులపై తీవ్ర నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించబోమని తేల్చి చెప్పారు. అయితే, చైనా మాత్రం భారత దళాలే దాడులకు కారణమంటూ ఆరోపణలకు దిగింది. అయితే, చర్చలతోనే సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది.

సరిహద్దు వెంబడి సైన్యం, వాహనాల మోహరింపు..

సరిహద్దు వెంబడి సైన్యం, వాహనాల మోహరింపు..


అయితే, గురువారం సరిహద్దు వెంబడి, గాల్వన్ లోయ సమీపం వరకు కూడా చైనా దళాలు భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. ఓవైపు చర్చలంటూనే చైనా ఇలాంటి కుట్రలకు దిగుతోంది. చైనా చర్యలను గమనించిన భారత్.. సరిహద్దు వెంబడి సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది. ఒక వేళ చైనా దాడికి దిగితే తగినవిధంగా బుద్ది చెప్పేందుకు సిద్ధమైంది.

Recommended Video

#Watch Sreesanth Flexes Muscles For Ranji Trophy Selection
ధీటుగా జవాబిచ్చేందు భారత దళాలు సిద్ధం..

ధీటుగా జవాబిచ్చేందు భారత దళాలు సిద్ధం..

భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖతోపాటు సముద్ర తీరాల వెంబడి కూడా భారత్ నిఘాను పెంచింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత బలగాలతోపాటు సైనిక వాహనాలను కూడా మోహరించింది. ఒకవేళ చైనా దాడులకు దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భారత సరిహద్దును కాపాడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక అంగుళం కూడా చైనాకు పోనివ్వలేదని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
Chinese Bring In hundreds of Bulldozers, Disturb Flow Of Galwan River: media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X