భారత్ కు బిగ్ రిలీఫ్.. ఎరువులు, యంత్రాల సరఫరాకు చైనా సిద్ధం..!
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశం అయ్యారు. గతేడాది ప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం అయినప్పటినుంచి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయని అజిత్ దోవల్ అన్నారు. ఇరు దేశాలు లాభ పడ్డాయని తెలిపారు. భారత్- చైనా సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతత నెలకొందని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధికి గతేడాది రష్యాలోని కజాన్ లో జరిగిన మోదీ- జిన్ పింగ్ సమావేశం కీలకంగా మారిందని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశం అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాంగ్ యీ దిల్లీ చేరుకున్నారు. అజిత్ దోవల్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల అభివృద్ధి, సత్సంబంధాలపై చర్చించారు. రిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతత నెలకొందని అజిత్ దోవల్ వెల్లడించారు. అలాగే పలు అంశాలపైనా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆగస్టు చివర్లో తియాంజిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.
అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్ పింగ్ గతేడాది రష్యాలోని కజాన్ లో సమావేశం అయ్యారని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దులో స్టెబిలిటీ ఏర్పడిందని స్పష్టం చేశారు. తాము ప్రధాని మోదీని ఎస్ సీఓ సమ్మిట్ కోసం చైనాకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు దీర్ఘకాలికంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు.

అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ద్వైపాక్షిక సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ కు ఎరువులు, బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేసేందుకు చైనా అంగీకరించింది. 2023 నుంచి చైనా నుంచి భారత్ కు యూరియా సరఫరా నిలిచిపోయింది. తాజా భేటీతో ఎరువుల సరఫరాకు మార్గం సుగమం అయింది. మరోవైపు ఆగస్టు 19న మంగళవారం సాయంత్రం లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో మోదీతో వాంగ్ యీ భేటీ కానున్నారు.
-
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications