భారత్‌- చైనా బంధం బలపడుతోంది: ప్రధాని మోదీ

చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల భారత పర్యటన కారణంగా దిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీతో వాంగ్ యీ భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయన్నారు. గత ఏడాది రష్యాలోని కజాన్‌ లో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో తన భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య స్థిరమైన పురోగతి సాధించాయని అభిప్రాయపడ్డారు.

వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. చైనాలోని టియాంజిన్ లో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్ పింగ్ తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. భారత్, చైనాల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Chinese Foreign Minister Wang Yi Meets PM Modi During Two-Day Delhi Visit

అంతకుముందు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో విదేశాంగ మంత్రి ఎస్​ జై శంకర్​ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్‌ కు ఎరువులు, బోరింగ్‌ యంత్ర పరికరాలు, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేసేందుకు చైనా అంగీకరించింది. 2023 నుంచి చైనా నుంచి భారత్ కు యూరియా సరఫరా నిలిచిపోయింది. తాజా భేటీతో ఎరువుల సరఫరాకు మార్గం సుగమం అయింది. అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల అభివృద్ధి, సత్సంబంధాలపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+