వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మకు ప్రేమతో..: తల్లి కోసం 20 ఏళ్లుగా.. ఓ కొడుకు చేస్తున్న పని ఇది..

మానవ సంబంధాలు అత్యంత హీన స్థితికి చేరుకున్న ప్రస్తుత పరిస్థిత్లుల్లో.. ఈ విషయం వింటే లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని మీకు ఆశ్చర్యం కలగడమేకాదు, అతడిని తప్పకుండా అభినందించాలని అనిపిస్తుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలకు ఎంత విలువ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంధాలకు విలువనిస్తూ, గౌరవిస్తూ బతికే మనుషుల మధ్యే కొందరు దుర్మార్గులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను నడిరోడ్డు మీదకి నెట్టేసే కొడుకులు కొందరైతే, కన్న బంధాన్ని మరిచి కూతురిని చెరిచే మృగాళ్లు మరికొందరున్నారు.

ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ విషయం తెలిస్తే లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని మీకు ఆశ్చర్యం కలగడమేకాదు, అతడిని తప్పకుండా అభినందించాలని అనిపిస్తుంది.

20 ఏళ్లుగా యువతి వేషంలో...

20 ఏళ్లుగా యువతి వేషంలో...

చైనాలోని గుయీలీన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 20 సంవత్సరాలుగా యువతిలా వస్త్రధారణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనిని చూసి ఇరుగుపొరుగు వారు హేళన చేసేవారు. ఆడ పిల్లలానే ఉన్నావంటూ వెక్కిరించేవారు. అయినా అతనికి తన సంకల్పం ముందు ఈ అవమానాలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. అతడు ఇదంతా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి కోసమే చేస్తున్నాడు.

అసలు విషయమేంటంటే..

అసలు విషయమేంటంటే..

చైనాకు చెందిన లీ అనే మహిళకు ఇద్దరు సంతానం. పాప, బాబును లీ అల్లారుముద్దుగా చూసుకునేది. అయితే అనుకోని ప్రమాదంలో పాప చనిపోయింది. ఆమె మరణం లీని ఎంతగానో కుంగదీసింది. పాపనే గుర్తు చేసుకుంటూ కుమిలిపోయేది. అలా కొన్నాళ్లకు ఆ వేదనతో అనారోగ్యం పాలైంది. ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. పిచ్చి పట్టిన ఆ తల్లి తనకు దూరమవుతుందేమోనన్న భయంతో ఆమె మానసిక పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కొడుకు భావించాడు.

అచ్చు అమ్మాయిలా...

అచ్చు అమ్మాయిలా...

అప్పటి నుంచి ఆ కొడుకు అచ్చం అమ్మాయిలాగే వస్త్రాలు ధరించేవాడు. చెల్లి తిరిగొచ్చిందని తల్లిని నమ్మించడానికి ప్రయత్నించేవాడు. ఇద్దరి పోలికలు దగ్గరగా ఉండటంతో ఆమె కూడా కూతురే తనను చూసుకుంటుందని భావించేది. అలా లీ కొడుకు ఆమెను 20 ఏళ్లుగా ఆమె కూతురిలా చూసుకుంటున్నాడు. ఈ విషయంపై చైనా మీడియా ఆమె కొడుకును ఇంటర్వ్యూ కూడా చేసింది.

అమ్మ ఆరోగ్యమే ముఖ్యం..

అమ్మ ఆరోగ్యమే ముఖ్యం..

తొలిసారి తాను తన చెల్లిలా దుస్తులు ధరించినప్పుడు తన తల్లి ముఖంలో సంతోషం చూశానని, అప్పటి నుంచి గత 20 ఏళ్లుగా ఆమె కోసం ఇలానే ఉంటున్నానని చెప్పాడు. తన దగ్గర మగవాళ్లు ధరించే దుస్తులేవీ లేవని తెలిపాడు. తన వస్త్రధారణపై ఎవరేమనుకున్నా పట్టించుకోనని, తన తల్లి ఆరోగ్యమే తనకు ముఖ్యమని చెప్పాడు. ఇదంతా తాను తన తల్లి కోసం చేస్తున్నానని, ఎదుటి వాళ్ల నవ్వులు, హేళన తాను పట్టించుకోనని అతడు పేర్కొంటున్నాడు. ఈ వ్యక్తి పేరు బయటికి రాకపోయినా.. ఇతడికి సంబంధించిన వీడియోను 4.2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అతను తన తల్లిపై చూపిస్తున్న ప్రేమకు చైనీయులతో పాటు పలు దేశాల ప్రజలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

English summary
A Chinese man has dressed as a woman for 20 years to help his mentally ill mother cope with the death of his sister. The unnamed man, from Guilin in the Guangxi region, is seen wearing a traditional cheongsam dress while looking after his elderly mother in a video about his story. He said he started dressing as a woman after his mother began showing signs of mental illness following the death of her daughter. "The first time I dressed as a woman she was so happy, so I kept doing it," he told Pear Video, whose film has been watched more than 4.2 million times and been shared widely in China. "I've basically been living as a woman ever since. I don't own any men's clothing."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X