• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాల్చుకున్నట్లే, మీరు కాదు.. మేం భయపడాలి: భారత్‌కు చైనా మీడియా హెచ్చరిక

|

బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు టిబెట్ కార్డును భారత్ ఉపయోగిస్తే చేతులు కాల్చుకున్నట్లేనని చైనా మీడియా హెచ్చరించింది.

సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో పాంగోంగ్ సరస్సు తీరం వద్ద టిబెట్ జెండాను ఎగరేసిన విషయాన్ని నేషనల్ గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రస్తావించింది. భారత్ ఇలాంటి రాజకీయ చర్యలు చేపడితే చేతులు కాల్చుకోవడమే అవుతుందని హెచ్చరించింది.

'భారత్‌ను చైనా ఓడించలేదు, కానీ యుద్ధం వస్తే.., మోడీ పర్యటనతో అనుకున్నా'

భారత్ - చైనా సరిహద్దులో ఉన్న బ్యాంగాంగ్ సరస్సు (భారత్‌లో ప్యాంగంగ్ లేక్) సరిహద్దులో టిబెట్ జాతీయ జెండాను ఎగురవేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఈ లడక్ సరస్సును వ్యూహాత్మకంగా పరిగణిస్తారు.

ఉత్తర భారత దేశంలో ప్రవాస టిబెటన్ పరిపాలనా యంత్రాంగం ఈ ప్రాంతంలో జెండాను ఎగురవేయడం ఇదే తొలిసారి అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. టిబెట్ విషయంలో భారత్ అనవసరంగా వేలు పెట్టవద్దని చెప్పింది. టిబెట్ వ్యవహారాల్లో తలదూరిస్తే చైనా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.

భారతే పునరాలోచన చేయాలి

భారతే పునరాలోచన చేయాలి

అంతేకాదు, సరిహద్దులో ఉద్రిక్తతపై భారత్ పునరాలోచన చేయాలని కూడా సూచించింది. ఏప్రిల్ నెలలో దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పటి నుంచి చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ అక్కడ దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా నిరసించింది.

అందుకే, భద్రత గురించి భయపడాల్సింది భారత్ కాదు.. చైనా

అందుకే, భద్రత గురించి భయపడాల్సింది భారత్ కాదు.. చైనా

భారత ఈశాన్య ప్రాంతంతో అనుసంధానమైన సిలిగురి కారిడార్ మీదుగా చైనా దాడులు చేస్తుందన్న భయాందోళనలు అర్థ రహితమని చైనా పత్రికలు పేర్కొన్నాయి. అమెరికా, జపాన్‌తో భారత్‌ రక్షణ సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రత గురించి ఆందోళన చెందాల్సింది చైనానే... భారత్‌ కాదని చెప్పింది.

మలబార్ యుద్ధ విన్యాసాలపై..

మలబార్ యుద్ధ విన్యాసాలపై..

మలబార్‌ యుద్ధ విన్యాసాల పైనా ఆ పత్రిక రాసింది. ఏ దేశాన్నీ శాసించనంత వరకు ఈ విన్యాసాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చైనా చెబుతుండగా.. అమెరికా నుంచి భారత్‌ ఆయుధాలు కొంటున్న నేపథ్యంలో దీనిపై చైనా దృష్టి సారించాలని ఆ పత్రిక పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో భారత్, జపాన్, అమెరికా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు విన్యాసాలు నిర్వహించాయి. మలబార్ 2017 పేరుతో జూలై 10 నుంచి 17 వరకు మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనిపై పై విధంగా స్పందించారు.

ద్వైపాక్షిక భేటీ జరగలేదని..

ద్వైపాక్షిక భేటీ జరగలేదని..

జర్మనీలోని హాంబర్గ్‌లో ఇటీవల జి 20 దేశాల సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోడీతో తమ అధ్యక్షులు జీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం జరపలేదని చైనా ప్రకటించింది. అధి బ్రిక్స్ అనధికారిక సమావేసమని, దీనికే మోడీ హాజరయ్యారని పేర్కొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India will have "burned itself" if it has allowed Tibetan exiles' political act of flag-hoisting along the India-China border in Leh, a Chinese daily has warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more