Xi Jinping: వైట్ హాస్ సాక్షిగా బయటపడ్డ అనారోగ్యం? చైనాలో మొదలైన కలకలం..

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన వాషింగ్టన్ సమ్మిట్ సందర్భంగా చైనా అధికారులు చేసిన కొన్ని అసాధారణ ఏర్పాట్లు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 73 ఏళ్ల జిన్‌పింగ్ తీవ్రమైన అలసటతో ఉన్నారని, పర్యటన మధ్యలో ఆయనకు ప్రత్యేక విశ్రాంతి అవసరమైందంటూ వెలువడిన కథనాలు ఇప్పుడు గ్లోబల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు అగ్రదేశాల అగ్రనేతల భేటీలో ముందెన్నడూ లేని విధంగా షెడ్యూల్‌ను కుదించడం, స్పెషల్ బ్రేక్స్ ఇవ్వడంపై దౌత్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఐదు గంటల గ్యాప్.. ప్రత్యేక గది ఏర్పాటు

సమ్మిట్ సమయంలో జిన్‌పింగ్ విశ్రాంతి కోసం వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లో ఒక ప్రైవేట్ రూమ్‌ను కేటాయించాలని చైనా ప్రతినిధులు కోరినట్లు సమాచారం. ఆ గదిలోకి కేవలం ఆయన భార్య పెంగ్ లియువాన్‌ను మాత్రమే అనుమతించారు. చైనా ప్రతినిధి బృందంలోని కీలక అధికారులకు కూడా అక్కడ ప్రవేశం లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ట్రంప్‌తో ముందుగా అనుకున్న వర్కింగ్ లంచ్‌ను కూడా రద్దు చేయించి, దాదాపు ఐదు గంటల పాటు షీ జిన్‌పింగ్‌కు ఖాళీ సమయం ఇచ్చేలా షెడ్యూల్ మార్చారు. అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ సందర్శనను కూడా కేవలం 10 నిమిషాలకే కుదించడం, ఆయన ఎక్కువసేపు నుంచోలేకపోవడమే కారణమనే ప్రచారం జరుగుతోంది.

Chinese President Xi Jinping Health Questions Surface After Unusual Rest Request At Washington Summit
Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?
Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?

విమానం మెట్లు దిగుతూ సపోర్ట్.. చైనా టీవీ నుంచి సెన్సార్!

అమెరికాలో అడుగుపెట్టిన సమయం నుంచి జిన్‌పింగ్ శారీరక కదలికలను నిపుణులు నిశితంగా పరిశీలించారు. విమానం మెట్లు దిగేటప్పుడు ఆయన ఒకచేతితో భార్య చేయి పట్టుకుని, మరోచేతితో విమానం సైడ్ రైలింగ్‌ను గట్టిగా పట్టుకుని నడవడం కనిపించింది. అయితే ఇటువంటి దృశ్యాలను చైనా ప్రభుత్వ అధికారిక టీవీ ప్రసారాల్లో కనిపించకుండా ఎడిట్ చేయడం గమనార్హం. చైనాలో జిన్‌పింగ్ అధికారాన్ని చేజిక్కించుకున్న తీరు, ఆయనకు ప్రత్యమ్నాయ నాయకుడు ఇంకా ఖరారు కాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై వచ్చే ప్రతీ చిన్న వార్త ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది.

జిన్‌పింగ్‌కు ట్రంప్ గద్ద గిఫ్ట్.. భోజనం పెట్టి చర్చలు జరిపినా తలోదారేనా?
జిన్‌పింగ్‌కు ట్రంప్ గద్ద గిఫ్ట్.. భోజనం పెట్టి చర్చలు జరిపినా తలోదారేనా?

గతంలోనూ కీలక విందులకు గైర్హాజరు

షీ జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఇలాంటి సందేహాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్ సమయంలోనూ ఆయన ఆఖరి నిమిషంలో అనారోగ్యం కారణంగా అధికారిక విందుకు హాజరుకాకపోవడంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అలాగే 2019 యూరప్ పర్యటనలో ఆయన నడకలో కుంటడం, కూర్చోవడానికి సపోర్ట్ తీసుకోవడం లాంటివి వార్తల్లో నిలిచాయి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతల మధ్య జరగాల్సిన కీలక భేటీ అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముగిసిపోవడం, దౌత్య చరిత్రలోనే ఇలాంటి వింత విశ్రాంతి విజ్ఞప్తులు ముందెన్నడూ చూడకపోవడం జిన్‌పింగ్ హెల్త్ బులిటెన్‌పై సందేహాలను మరింత పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+