వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఐఏ సీక్రెట్ మ్యూజియం: సద్దాం హుస్సేన్ లెదర్ జాకెట్, ఒసామా బిన్ లాడెన్ ఇల్లూ ఇక్కడ ఉంటాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సీఐఏ మ్యూజియం

ప్రపంచ చరిత్ర గతిని మార్చిన కొన్ని వస్తువులతో నిండిన అసాధారణమైన మ్యూజియం అమెరికాలో ఉంది. కానీ, వీటిలో సామాన్యులకు అనుమతి లేదు.

ఈ మ్యూజియంలో ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు వాడిన తుపాకీ, ఆ పక్కనే సద్దాం హుస్సేన్ ధరించిన లెదర్ జ్యాకెట్ కూడా కనిపిస్తాయి.

ఇవన్నీ సీఐఏ అంతర్గత మ్యూజియంలో భాగమైన వస్తువులు.

వర్జీనియాలోని అమెరికన్ ఇంటెలిజెన్స్ ప్రధాన కేంద్రంలో ఉన్న ఈ మ్యూజియంను 75వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని రిపేర్లు నిర్వహించి పునరుద్ధరించారు.

ఈ మ్యూజియాన్ని చూసేందుకు కొంత మంది విలేఖరులతో పాటు బీబీసీకి కూడా ప్రత్యేక అవకాశం దొరికింది. అయితే, అక్కడ తిరుగుతున్నంత సేపు మన పక్కనే ఒక భద్రతా సిబ్బంది కూడా ఉంటారు.

600 వస్తువులు ఈ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇందులో ప్రచ్ఛన్న యుద్ధంలో గూఢచారులు వినియోగించిన పరికరాలు కూడా ఉన్నాయి.

గూఢచారులు సందేశాలను చేరవేసిన పరికరం, సిగరెట్ ప్యాకెట్ లోపల అమర్చిన సీక్రెట్ కెమెరా, పావురానికి అమర్చి పంపే కెమెరాలతో పాటు విరిగిన కాక్ టెయిల్ గ్లాస్ కూడా ఇక్కడ చూడొచ్చు.

సీఐఏ ఇటీవల నిర్వహించిన ప్రముఖమైన కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ మ్యూజియంలో చూడొచ్చు.

పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ స్థావరాన్ని పోలిన నమూనా

పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ స్థావరాన్ని పోలిన నమూనా కూడా ప్రదర్శనలో ఉంది. ఆయన స్థావరం పై దాడుల నిర్వహణను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమోదించడానికి ముందు ఆయనకు ఈ నమూనాను చూపించారు.

2011లో జరిగిన ఈ దాడిలో అల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ మరణించారు.

"ఈ వివరాలను 3డీలో చూపించడం వల్ల దేశాధినేతలకు వివరించడంలోసహాయపడటంతో పాటు సీఐఏ ఆపరేటర్లు మిషన్ కు సంబంధించిన ప్రణాళికలు వేసుకునేందుకు సహాయపడింది" అని మ్యూజియం డైరెక్టర్ రాబర్ట్ జీ బయర్ చెప్పారు.

అమెరికా ఈ ఏడాది జులైలో అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో మరొక స్థావరం పై క్షిపణి దాడి చేసింది. ఇందులో అల్ ఖైదా కొత్త నాయకుడు అయ్‌మాన్ అల్ జవహిరిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

ఈ మిషన్ గురించి జులై 01, 2022లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించేందుకు ఉపయోగించిన జవహిరి ఇంటి మోడల్‌ను ఇటీవలే ఏర్పాటు చేశారు.

యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు జవహిరి కదలికలను కొన్ని నెలల పాటు గమనించిన తర్వాత ఆయన బాల్కనీలో ఉండగా దాడి చేశారు.

"తీవ్రవాద నిరోధక శాఖ అధికారులు, తమ టార్గెట్లు, వారి జీవనశైలిని పరిశీలించే విధానాన్ని ఈ మిషన్ తెలియచేస్తుంది" అని బయర్ అన్నారు.

జవహరి కాంపౌండ్ నమూనా

మ్యూజియం మొదటి భాగంలో 1947లో లో సీఐఏ స్థాపన నుంచి, ప్రచ్ఛన్న యుద్ధం, సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాత తీవ్రవాద వ్యతిరేక చర్యల వరకు, అనేక ఘటనలకు సంబంధించిన వివరాలుంటాయి.

ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి వస్తువులను కూడా కొంత మంది బంధువులు మ్యూజియంకు విరాళంగా ఇచ్చారు. ఈ వస్తువులను కూడా ఇక్కడ చూడొచ్చు.

సీఐఏ సిబ్బంది, అధికారిక సందర్శకులు మాత్రమే ఈ మ్యూజియంలోకి అనుమతిస్తారు.

ఈ మ్యూజియం కేవలం విజయాల పై మాత్రమే దృష్టి పెట్టదు. బే ఆఫ్ పిగ్స్ ఫియాస్కో లో ఉన్న ఒక విభాగంలో సీఐఏ మిషన్ క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో ను పడగొట్టేందుకు విఫలయత్నాలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.

ఇరాక్‌లో అణ్వస్త్ర ఆయుధాలను కనిపెట్టలేకపోవడంలో వైఫల్యాలకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

"ఇది కేవలం చరిత్ర కోసం రూపొందిన మ్యూజియం కాదు. ఇది నిత్యం పని చేసే మ్యూజియం. ఈ మ్యూజియం ద్వారా మేము సీఐఏలో అధికారులకు గత చరిత్రను వివరిస్తాం" అని బయర్ చెప్పారు.

"మా అధికారులు సీఐఏ చరిత్ర తెలుసుకుని ఉండటం వల్ల భవిష్యత్తులో ఉత్తమమైన సేవలు అందించగల్గుతారు. మున్ముందు మెరుగ్గా పని చేసేందుకు మన విజయాలు, వైఫల్యాల నుంచి నేర్చుకోవాలి" అని అన్నారు.

సీఐఏ నిర్వహించే కొన్ని వివాదాస్పద అంశాలు బయటకు కనిపించవు. ఉదాహరణకు ఇరాన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు 1953లో ఎమ్‌16తో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ఉండవు.

2001 తర్వాత తీవ్రవాదులనే అనుమానంతో వేధింపులకు గురి చేసిన వివరాలు కూడా కనిపించవు.

గత ఆపరేషన్లు

మ్యూజియంలోని రెండవ భాగంలో కొన్ని ప్రత్యేక ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

1960ల చివర్లో సోవియెట్ యూనియన్ కు చెందిన జలాంతర్గామి సముద్రగర్భంలో మాయమయింది. దీనిని అమెరికా కనిపెట్టిన తర్వాత విధ్వంసమైన సబ్‌మెరైన్‌ను, అందులో ఉన్న సాంకేతికతను సముద్రగర్భం లోంచి వెలికి తీసేందుకు కోటీశ్వరుడు హోవార్డ్ హూగ్‌తో కలిసి సీఐఏ పని చేసింది.

అయితే, హుగ్స్ గ్లోమర్ ఎక్స్ ప్లోరర్ అనే షిప్ సహాయంతో సముద్రంలో తవ్వకాలు జరుపుతారనే కథనం బయటకు వచ్చింది.

సముద్రంలో మునిగిన కే-129 జలాంతర్గామి నమూనా. వీటిని గతంలో ప్రదర్శనకు పెట్టలేదు.
ఈ మ్యూజియంలో సోవియెట్ జలాంతర్గామి నమూనా, దుస్తులు, యాష్ ట్రే లు, గ్లోమర్ షిప్ ఉపరితలాన్ని సురక్షితంగా ఉంచేందుకు వాడిన మెయిల్ బ్యాగ్ లు కూడా ఉన్నాయి.

ఈ మ్యూజియంలో సోవియెట్ జలాంతర్గామి నమూనా, దుస్తులు, యాష్ ట్రే లు, గ్లోమర్ షిప్ ఉపరితలాన్ని సురక్షితంగా ఉంచేందుకు వాడిన మెయిల్ బ్యాగ్ లు కూడా ఉన్నాయి.

సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ ఈ నౌకను చూసేందుకు వెళ్ళినప్పుడు ఆయనను గుర్తు పట్టకుండా వాడిన విగ్ కూడా ప్రదర్శనలో ఉంది.

అయితే, ఈ మిషన్ పాక్షిక విజయం మాత్రమే సాధించింది. గ్లోమర్ స్టీలు పంజాలు జలాంతర్గామిని వెలికి తీసేందుకుప్రయత్నించినప్పుడు ఈ జలాంతర్గామి విరిగిపోయింది. అయితే, కొన్ని భాగాలను మాత్రం వెలికి

తీయగలిగారు.

"ఈ జలాంతర్గామిలో లభించిన చాలా వస్తువులను ప్రదర్శనలో ఉంచారు" అని బయర్ చెప్పారు.

ఈ జలాంతర్గామిని వెలికి తీసేందుకు ప్రాజెక్ట్ ఆజోరియన్ అనే పేరు పెట్టారు. ఈ మిషన్ పూర్తయ్యే లోపు అధికారులు మిషన్ గురించి వివరించేందుకు "మేము ధృవీకరించలేం, ఖండించలేం"('We can neither confirm or deny') అని అనేవారు. దీనినే గ్లోమర్ సమాధానం అని అంటారు. ఈ మాటలను ఇప్పటికీ విరివిగా వాడుతున్నారు.

ఆర్గో అనే నకిలీ సినిమా కోసం కవర్ స్టోరీ ని సృష్టించేందుకు వాడిన కొన్ని వస్తువులు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

ఆర్గో అనే నకిలీ సినిమా కోసం కవర్ స్టోరీని సృష్టించేందుకు వాడిన కొన్ని వస్తువులు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

దీని ద్వారా ఇరాన్ లో 1979 విప్లవం తర్వాత అక్కడ చిక్కుకుపోయిన దౌత్యవేత్తలను రక్షించేందుకు వీలవుతుంది. ఈ కథను తర్వాత హాలీవుడ్ సినిమాగా కూడా నిర్మించారు. సహాయక బృందాలు ఈ నకిలీ సినిమా కోసం సృష్టించిన వస్తువులు కూడా ఉన్నాయి.

ఈ కళారూపాలను అర్ధం చేసుకోవడం కష్టంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూపొందించారు.

ఈ మ్యూజియం పై కప్పు పై కూడా కొన్ని సందేశాలు వివిధ కోడ్ రూపాల్లో దాగి ఉంటాయి.

మ్యూజియం పై కప్పు పై కూడా కొన్ని సందేశాలు వివిధ కోడ్ రూపాల్లో దాగి ఉంటాయి.

ఈ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వాటినెవరైనా కనిపెట్టగలరేమో చూడాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు సీఐఏ అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నిటిని ఆన్ లైన్ లో చూడొచ్చు.

ప్రస్తుతానికి మాత్రం ఈ మ్యూజియం చూసేందుకు ఇదొక్కటే ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
CIA Secret Museum: Saddam Hussein's Leather Jacket, Osama Bin Laden's
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X