మత పెద్ద రెచ్చగొట్టడం వల్లే చంపేశాడు: పాక్ మోడల్ తల్లి

Subscribe to Oneindia Telugu

లాహోర్: తమ కుమార్తె హత్యకు మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖవి కారణమని పాకిస్థాన్ వివాస్పద మోడల్, నటి కండీల్ బలోచ్‌(26) తల్లి ఆరోపించారు. తన కొడుకు మొహ్మద్ వసీంను ముఫ్తీ అబ్దుల్ రెచ్చగొట్టి తన కూతురును చంపించాడని ఆమె పేర్కొంది.

మోడల్ తల్లి ఆరోపణలు చేసిన సమయంలోనే కండీల్ హత్య కేసులో ముఫ్తీ పేరును చేర్చినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా, కండీల్‌ను కాల్చి చంపిన కేసులో ఆమె సోదరుడు మహ్మద్ వసీమ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాందీల్ అసలు పేరు ఫౌజీయా అజీమ్ అని, మోడలింగ్ పేరుతో అసభ్యకర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేస్తోందన్న కారణంతో చంపినట్లు నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.

Cleric Mufti Abdul Qavi 'Provoked' Murder Of Qandeel Baloch: Mother

కాగా, జియో న్యూస్‌తో కండీల్ తల్లి మాట్లాడుతూ.. తన కూతురు హత్య కేసులో ముఫ్తీ అబ్దుల్ ఖవి, కండీల్ మాజీ భర్త ఆశిక్ హుస్సేన్, మరో వ్యక్తి షాహిద్ ప్రమేయముందని ఆరోపించింది. ఖవి రెచ్చగొట్టడం వల్లే కండీల్‌ను వసీం చంపాడని తెలిపింది. కండీల్ మాజీ భర్త హుస్సేన్ తోనూ వసీం కాంటాక్టులో ఉన్నాడని చెప్పింది.

అక్క పరువు తీసింది, తెలియకుండా చంపేశా: పాక్ మోడల్ సోదరుడి అరెస్ట్

కండీల్ హత్య కేసులో ఖవి పేరు కూడా చేర్చామని, ఫొరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నామని ముల్తాన్ పోలీస్ చీఫ్ అజహర్ అక్రమ్ తెలిపారు. కాగా, కండీల్‌తో సెల్ఫీ దిగడంతో ఖవి.. తన మతాధికారి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The mother of slain Pakistani model Qandeel Baloch today alleged that prominent cleric Mufti Abdul Qavi, who made headlines for appearing in a controversial video with the social media star, "provoked" her son into murdering her daughter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి