షాంఘైలో కరోనా విజృంభణ; తొలిసారిగా ముగ్గురు మృతితో ఆందోళన

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. షాంఘై నగరంలో కరోనా ఉధృతి కంట్రోల్ లోకి రావడం లేదు. చైనాలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ షాంఘైలో ఆదివారం ఒకేరోజు 22 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా కరోనా వైరస్ మహమ్మారి తో ఆదివారంనాడు ముగ్గురు మరణించారు.

కరోనా మలిదశలో చైనాలో మళ్ళీ మరణాలు

కరోనా మలిదశలో చైనాలో మళ్ళీ మరణాలు


షాంఘై దాని పెరుగుతున్న కోవిడ్ -19 వ్యాప్తితో మొదటి మరణాలను నివేదించింది. షాంఘై అధికారిక లెక్కల ప్రకారం, ఆదివారం ముగ్గురు వ్యక్తులు మరణించారు. వారు 89 మరియు 91 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా వారందరికీ ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈశాన్య ప్రావిన్స్ జిలిన్‌లో మార్చి మధ్యలో ఇద్దరు వ్యక్తులు మరణించిన తర్వాత కొత్తగా నివేదించబడిన మరణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తొలి మరణాలు. కరోనా మలిదశలో చైనాలో కరోనా మరణాలు నమోదు కావడం ఇది రెండోసారి.

ఓమిక్రాన్ వేరియంట్ తో పోరాడుతున్న షాంఘై

ఓమిక్రాన్ వేరియంట్ తో పోరాడుతున్న షాంఘై

షాంఘైలోని రెండు వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా ప్రేరేపించబడిన కరోనా వ్యాప్తితో పోరాడుతున్నాయి.ఈ క్రమంలోనే మూడు మరణాలు సంభవించాయి. షాంఘైలో ఇటీవల నిత్యం 23,000 కంటే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదు చేయబడ్డాయి. మరిన్ని నగరాలు కరోనాకు కేంద్రాలుగా మారుతున్నట్టు ప్రకటించాయి. షాంఘై యొక్క 25 మిలియన్ల మంది నివాసితుల లాక్డౌన్ మరియు పునరావృత పరీక్షలు కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక పోతుంది. ఆదివారం 22,000 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.

10 రోజుల శిశువు నుండి 100 ఏళ్ళ వారి వరకు అందరినీ పట్టి పీడిస్తున్న మహమ్మారి

10 రోజుల శిశువు నుండి 100 ఏళ్ళ వారి వరకు అందరినీ పట్టి పీడిస్తున్న మహమ్మారి

రెండు సంవత్సరాల క్రితం వుహాన్ నుండి చైనా యొక్క అత్యంత ఘోరమైన కోవిడ్ వ్యాప్తికి షాంఘై కేంద్రంగా ఉంది. కానీ వైరస్ సోకిన చాలా మందిలో ప్రభుత్వం నివేదించబడిన లెక్కల ప్రకారం తీవ్ర అనారోగ్య రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. షాంఘై మునిసిపల్ హెల్త్ కమీషన్ ప్రకారం, ఓమిక్రాన్ రూపాంతరం జనాభాలో విపరీతంగా పెరిగింది. కేవలం 10 రోజుల వయస్సు ఉన్న నవజాత శిశువు నుండి 100కి చేరువైన ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకింది. నగర వాసులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నా కరోనా మహమ్మారి మాత్రం చైనా దేశాన్ని పట్టి పీడిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+