వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్యాన్, 30 రోజుల నిషేధం విధించిన పెద్దన్న..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాపకింద నీరులా వైరస్ ప్రబలడంతో ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికా కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఎక్కువగా ప్రబలుతోన్న యూరప్ నుంచి 30 రోజుల పాటు పర్యాటకులను అనుమతించబోమని అమెరికా స్పష్టంచేసింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో వైరస్ సోకి 37 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,015 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus Update | SBI Interest Rates| MP Political Crisis | Oneindia

యూరప్ నుంచి వచ్చే అన్నిదేశాలపై నిషేధం విధించిన అమెరికా.. తమతో సన్నిహితంగా మెలిగే బ్రిటన్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కొత్త నిబంధన శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు వైట్‌హౌస్‌లో మీడియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. అయితే అమెరికా తిరిగి వచ్చే ప్రయాణికులు.. స్రీన్ టెస్ట్‌లు రెండు, మూడు ఆపై ఎక్కువ సార్లు చేయించుకొని, కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన వారిని అనుమతిస్తామని పేర్కొన్నారు.

corona effect: US suspends all travel from Europe for 30 days

కరోనా వైరస్ నివారించడంలో యూరొపియన్ యూనియన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. వైరస్ ప్రబలుతోన్న తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదని చెప్పారు. కరోనా వైరస్.. ఆర్థిక మాంద్యం కాదని, ఆరోగ్యానికి సంబంధించినది అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఉంటుందని, కానీ దానిని సమూలంగా నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం పెట్టుబడిదారుల సాయం కూడా తీసుకుంటామని ట్రంప్ స్పష్టంచేశారు.

English summary
US President Donald Trump has announced he is suspending all travel from Europe, excluding the UK, to the US for the next 30 days to stop the spread of the coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X