వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ద్వారా కరోనా వ్యాప్తి .. బలమైన ఆధారాలు : లాన్సెట్ జర్నల్ లో సంచలన విషయాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుందని , గాలి ద్వారా కరోనా వ్యాప్తికి సంబంధించి స్థిరమైన బలమైన ఆధారాలు ఉన్నాయని మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించింది. యూకే ,యూఎస్ఏ మరియు కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ లోని రసాయన శాస్త్రవేత్త జోస్ లూయిస్ జిమెనెజ్ సహా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ (CIRES) మరియు కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ప్రకారం గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని నిర్ధారించింది.

Recommended Video

COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ .. రెండో సారి మహమ్మారి బారిన పడిన సీఎంకర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ .. రెండో సారి మహమ్మారి బారిన పడిన సీఎం

 గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని బలమైన ఆధారాలు

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని బలమైన ఆధారాలు

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆధారాలు అధికంగా ఉన్నాయని జిమెనెజ్ చెప్పారు.

గతంలో కోవిడ్ గాలి ద్వారా వ్యాపిస్తుంది అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించిన వారు, ఇప్పుడు గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని తేల్చి చెబుతున్నారు. అందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాపించదు అన్న అలసత్వం ప్రజల్లో పెరిగిపోయిందని అందుకే వ్యాప్తి అధికంగా ఉందని వారు పేర్కొన్నారు.

గాలి ద్వారా కరోనా ప్రాబల్యానికి సంబంధించిన 10 ఆధారాలు వెల్లడించిన లాన్సెట్

గాలి ద్వారా కరోనా ప్రాబల్యానికి సంబంధించిన 10 ఆధారాలు వెల్లడించిన లాన్సెట్

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క ట్రిష్ గ్రీన్హాల్గ్ నేతృత్వంలోని నిపుణుల బృందం, ప్రచురించిన పరిశోధనలను సమీక్షించింది . గాలి ద్వారా కరోనా ప్రాబల్యానికి సంబంధించిన 10 ఆధారాలను గుర్తించింది.

స్కగిట్ కోయిర్ వ్యాప్తి వంటి సూపర్-స్ప్రెడర్ సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలిచాయని చెప్పింది. మార్చి 17, 2020 న, వాషింగ్టన్, స్కగిట్ కౌంటీ సభ్యుడు, 122 మంది సభ్యుల గాయక బృందంలో చాలా మంది సభ్యులు అనారోగ్యానికి గురయ్యారని గాయక బృందం స్కగిట్ కౌంటీ పబ్లిక్ హెల్త్ కు తెలియజేసింది. రెండున్నర గంటల గానం తర్వాత చాలా మంది కరోనా బారిన పడ్డారు .

స్కగిట్ కోయిర్ సంఘటనలో తాకకుండానే కరోనా వ్యాప్తి .. గాలి ద్వారా అని తేల్చిన నిపుణులు

స్కగిట్ కోయిర్ సంఘటనలో తాకకుండానే కరోనా వ్యాప్తి .. గాలి ద్వారా అని తేల్చిన నిపుణులు

వారంతా పాడే చర్యలో భాగంగా ఏరోసోల్స్ ఉద్గారాల ద్వారా కరోనా బారిన పడ్డారని నిర్ధారించారు . ఇందులో వ్యాధి సోకిన ఒక కేసు నుండి 53 మంది వ్యాధి బారిన పడ్డారు. వారంతా అతనితో కాంటాక్ట్ లేకుండానే వైరస్ బారిన పడ్డారని నిర్ధారించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ యొక్క ప్రసార రేట్లు ఆరుబయట కంటే ఇంటి లోపల చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది . బయట వెంటిలేషన్ ద్వారా ప్రసారం బాగా తగ్గుతుందని అంటున్నారు . మొత్తం ప్రసారంలో కనీసం 40 శాతం మందికి దగ్గు లేదా తుమ్ము లేని వ్యక్తుల నుండి ఎలాంటి లక్షణాలు లేకుండా వ్యాప్తి చెందుతుందని పరిశోధన తేల్చింది.

 గాలిలో వైరస్ నియంత్రణ చర్యలకు వెంటిలేషన్ , ఎయిర్ ఫిల్టర్ , మాస్కులు ధరించటం మంచిది

గాలిలో వైరస్ నియంత్రణ చర్యలకు వెంటిలేషన్ , ఎయిర్ ఫిల్టర్ , మాస్కులు ధరించటం మంచిది

గాలిలో వైరస్ నియంత్రణ చర్యలకు వెంటిలేషన్ , ఎయిర్ ఫిల్టర్ చేయడం, ఇరుకైన రద్దీ ప్రదేశాలలో ఉండకపోవడం ,ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించడం చేయాలి. వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్న అనేక ఆధారాలు బయటపడ్డాయి అని చెబుతున్న శాస్త్రవేత్తలు గాలిలో వ్యాప్తి చెందిన వైరస్ కణాలను పీల్చడంవల్ల కరోనా సోకుతుందని వెల్లడించారు. పెద్ద పెద్ద తుంపర ద్వారా వైరస్ సులభంగా వ్యాపిస్తుందని ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదని పేర్కొన్నారు .

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి పట్ల అలెర్ట్ .. మాస్కులు ధరించటం ఉత్తమం

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి పట్ల అలెర్ట్ .. మాస్కులు ధరించటం ఉత్తమం

ఈ తుంపరలు గాలిలో వైరస్ ను వ్యాప్తి చేసి , తద్వారా మనుషులను కరోనా మహమ్మారి బారిన పడేస్తున్నాయి అని నిర్ధారించారు. కరోనా వైరస్ ప్రధానంగా గాలిలో ఉంటే, ఎవరైనా సోకిన వ్యక్తి ఊపిరి పీల్చుకున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, అరవడం, పాడటం లేదా తుమ్ముతున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఏరోసోల్‌లను పీల్చేటప్పుడు సంక్రమించే అవకాశం ఉంది. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని కూడా నిర్ధారణ అయింది కాబట్టి మాస్కులు ధరించడం మర్చిపోకండి. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు.

English summary
A new assessment in the medical journal Lancet has found "consistent, strong evidence" that the SARS-CoV-2 virus, which causes COVID-19, is predominantly transmitted through the air.Therefore, public health measures that fail to treat the virus as predominantly airborne leave people unprotected and allow the virus to spread, according to six experts from the UK, USA and Canada, including Jose-Luis Jimenez, a chemist at the Cooperative Institute for Research in Environmental Sciences (CIRES) and the University of Colorado Boulder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X