బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్.. వైరస్‌ను చులకన చేస్తూ, మాస్కులు వద్దన్న కొద్ది గంటలకే..

''కరోనా చాలా ఆత్మాభిమానం కలిగిన వైరస్. తన జోలికి వెళ్లిన వాళ్లను మాత్రమే కాటేస్తుంది''అని ఎవరో పెద్దలు చెప్పిన మాట అక్షరాల మరోసారి రుజువైంది. ఒకదిక్కు లక్షలాది మంది వైరస్ కాటుకు గురవుతూ, వేలల్లో ప్రాణాలు కోల్పోతుంటే.. మహమ్మారిని ఎంత చులకన చేయాలో అంతకు రెట్టింపు జోకులు వేసి.. కరోనా టెస్టులతో ఊరిపితిత్తులు క్లీన్ అవుతాయంటూ ఎద్దేవా చేశారు ఘనతవహించిన బ్రెజిట్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో. చివరికి మంగళవారం నాటి పరీక్షల్లో ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో భారీ షాక్ తగిలినట్లయింది.

వైరస్ పుట్టిన తొలి మూడు నెలల్లో ఫర్వాలేదనిపించినా, గడిచిన రెండు నెలలుగా బ్రెజిల్ లో కరోనా భయానకంగా విజృంభిస్తోంది. మంగళవారం నాటికి అక్కడ కేసుల సంఖ్య 16.5లక్షలకు చేరింది. డెత్ రేటు భయానక స్థాయిలో ఉండటంతో నెలల వ్యవధిలోనే ఏకంగా 66 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరిస్థితులతోపాటు అధ్యక్షుడు బోల్సొనారో వ్యవహార శైలి కూడా క్రమంగా దిగజారుతూ వచ్చింది.

Coronavirus: Brazils President Bolsonaro tests positive

దేశంలో వైరస్ సామూహిక వ్యాప్తి దశకు వచ్చిందన్న రిపోర్టుల నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ బ్రెజిల్ ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీచేయగా, ఆ నిబంధనలను అధ్యక్షుడు బోల్సొనారో కొట్టిపారేశారు. సరిగ్గా మాస్కులు వద్దని ఆదేశించిన రోజే ఆయనకు పాజిటివ్ అని తేలడం మరో విశేషం. కరోనా కేసుల్లో అమెరికా(30 లక్షల కేసులు, 1.33లక్షల మరణాలు) తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. 7.4లక్షల కేసులు, 20వేల పైచిలుకు మరణాలతో భారత్.. బ్రెజిల్ తర్వాతి స్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+