వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఆశ్చర్యం.. బుధవారం వుహాన్‌లో నమోదుకానీ ఒక్క పాజిటివ్ కేసు, మిగతాచోట్ల 34 కేసులు..

|
Google Oneindia TeluguNews

విశ్వ మానవాళిని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. క్రమంగా ఒక్కో దేశానికి వ్యాపిస్తూ.. ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. అయితే వైరస్ బయటపడిన వుహాన్‌లో మాత్రం పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. బుధవారం ఇక్కడ ఒక్క పాజిటివ్ కూడా నమోదుకాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందిన దేశాల్లో పాజిటివ్ కేసులే కాదు.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఇతరదేశాల నుంచి వచ్చినవారికి మాత్రం కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.

వుహాన్‌లో కొత్తగా ఎవరికీ ఇన్‌పెక్షన్ సోకగా పోయినా.. ఇతరదేశస్తులకు వైరస్ సోకడంతో అక్కడి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ దృష్ట్యా ఎయిర్‌పోర్టులలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. బుధవారం చైనాలో (వుహాన్ మినహా) 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొన్నది. అయితే ఇది మంగళవారంతో పోలిస్తే రెట్టింపు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు ముందు కేవలం 13 పాజిటివ్ కేసులు బయటపడగా.. బుధవారం నాటికి ఆ సంఖ్య 34కి చేరింది.

coronavirus: Chinas Wuhan reports no new infections for first time..

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

34 కేసుల్లో 21 బీజింగ్‌లో నమోదు కాగా.. మరో 13 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చినవారి అని ఆరోగ్య కమిషన్ పేర్కొన్నది. చైనాలో 80 వేల 928 మందికి వైరస్ సోకిందని ఆరోగ్య కమిషన్ ధృవీకరించింది. వీరందరికీ చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. వైరస్ సోకి దేశంలో 3 వేల 245 మంది చనిపోయారని.. బుధవారం 8 మంది చనిపోయారని సెంట్రల్ ప్రావిన్స్‌లో చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.

English summary
central Chinese city of Wuhan, the epicentre of the country's coronavirus outbreak, reported no new infections for the first time in wednes day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X