వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: కరోనా వైరస్‌ బాధితుల కోసం 10 రోజుల్లో పూర్తయిన హాస్పిటల్

|
Google Oneindia TeluguNews

చైనా: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 10 రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రిని నిర్మించింది. ఈ హాస్పిటల్‌ను వూహాన్ నగరంలో నిర్మించింది. 30వేల చదరపు గజాల్లో హౌషెన్షాన్ ఆస్పత్రిని నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్‌ను 10 రోజుల్లోగా నిర్మించి ఆదివారం ప్రభుత్వానికి అందజేశారు కాంట్రాక్టర్లు. ఇక సోమవారం రోజున తొలి కరోనా వైరస్ పేషెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు చైనా మీడియా పేర్కొంది.

Coronavirus:అమెరికా సహకారం తీసుకోనున్న చైనా...425కు చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్యCoronavirus:అమెరికా సహకారం తీసుకోనున్న చైనా...425కు చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య

బుధవారం పూర్తికానున్న రెండో హాస్పిటల్

చైనా తివ్రిధ దళాల్లో పనిచేస్తున్న దాదాపు 1400 మంది వైద్యులు వూహాన్‌ నగరంలోని ఈ కొత్త హాస్పిటల్‌కు చేరుకుని వైద్యసహకారం అందిస్తున్నారు. ఇక రెండో హాస్పిటల్ కూడా బుధవారం పూర్తి కానుంది. ఈ రెండు హాస్పిటల్‌లు అందుబాటులోకి రావడంతో ఇతర హాస్పిటల్‌లో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి 24న హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైంది. ఆ సమయంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 24గా ఉన్నింది. ఇక ఈ పదిరోజుల సమయంలోనే 362 మంది మృతి చెందారు. అంటే దాదాపు 14 రెట్లు పెరిగింది. ఇక అప్పటికి 830 మందికి ఈ మహమ్మారి సోకగా.. ఇప్పుడు ఆ సంఖ్య 17500కు చేరింది.

ప్రపంచదేశాలను ఆకట్టుకున్న చైనా తీరు

ఇక పదిరోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తికావడం ప్రపంచదేశాలను ఆకట్టుకుంది. ఇక ఈ నిర్మాణంను ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ మంది ప్రజలు వీడియోద్వారా వీక్షించారు. ఇక హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చైనా మీడియా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. దీన్నే మిషన్ ఇంపాజిబుల్‌గా పిలుచుకుంది. ఇక కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో చైనా ప్రజల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం పెల్లుబికింది.

 చైనా తీసుకుంటున్న చర్యలను గుర్తించని ప్రపంచ దేశాలు

చైనా తీసుకుంటున్న చర్యలను గుర్తించని ప్రపంచ దేశాలు

ఇదిలా ఉంటే కరోనావైరస్‌పై యుద్ధం చేస్తున్నామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇక చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. ఎక్కడైతే కరోనావైరస్ కేసులు బయటపడ్డాయో ఆ నగరాలన్నిటినీ మూసివేయడం జరిగింది. ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరికలు సైతం జారీ చేసింది. అయితే కరోనావైరస్‌పై పోరాడేందుకు చైనా తీసుకుంటున్న చర్యలు బయటి దేశాలు చాలావరకు గుర్తించడం లేదనే విమర్శ వస్తోంది. ఇక హాంకాంగ్‌లోని ఓ హాస్పిటల్ సిబ్బంది సోమవారం రోజున స్ట్రైక్‌కు దిగారు. చైనాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. హాంకాంగ్‌లో ఇప్పటి వరకు 15 కరోనాకేసులు బయటపడ్డాయి.

చైనాను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

చైనాను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ


ఇదిలా ఉంటే కరోనావైరస్‌పై పోరాడేందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ 22 బిలియన్ అమెరికన్ డాలర్లను కేటాయించింది. లూనార్ న్యూఇయర్ తర్వాత తొలిసారిగా చైనా స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఓ వైపు కరోనా వైరస్ బాధిస్తుంటే మరోవైపు బర్డ్ ఫ్లూ కూడా చైనాను వణికిస్తోంది. ఇప్పటికే 4500 కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. మరో 18వేల కోళ్లను ప్రభుత్వమే చంపేసింది.

English summary
A 1,000-bed hospital, built in just 10 days to address the overwhelming demand from the coronavirus outbreak, has opened in Wuhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X