వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus : చైనాలో 490కి పెరిగిన మృతుల సంఖ్య.. ఏయే దేశాల్లో ఎన్ని కేసులు..

|
Google Oneindia TeluguNews

చైనాలోని వుహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకు విస్తరించింది. కరోనా బారినపడి చైనాలో ఇప్పటివరకు 490 మంది మృతి చెందగా.. మరో 24,324మందికి వైరస్ సోకింది. కరోనా మృతి కేసులు హుబెయ్ ప్రావిన్స్‌లో నమోదైనవే. హాంకాంగ్‌లో మరో 17 కేసులు నమోదు కాగా.. మకావ్‌లో మరో 10 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24500 మంది వైరస్ బారిన పడ్డారు.

ఆయా దేశాల్లో నమోదైన కరోనా వైరస్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. జపాన్‌లో 34,థాయిలాండ్‌లో 25,సింగపూర్ 24,ఆస్ట్రేలియాలో 14,సౌత్ కొరియా 19,జర్మనీలో 12 కేసులు,అమెరికాలో 11,తైవాన్‌లో 11,మలేషియాలో 10,వియత్నాంలో 10,ఫ్రాన్స్‌లో 6,దుబాయిలో 5,కెనడాలో 4,ఇండియాలో 3,ఫిలీప్పీన్స్‌లో 3కేసులు,ఒక మృతి కేసు,రష్యాలో 2,ఇటలీలో 2 కేసులు,బ్రిటన్‌లో 2కేసులు,బెల్జియంలో 1,నేపాల్‌లో 1,శ్రీలంకలో 1,స్పెయిన్‌లో 1,కంబోడియాలో1,ఫిన్‌లాండ్‌లో 1 కేసు నమోదయ్యాయి.

coronavirus infected more than 24,500 people globally here is the list of countries

ఇక భారత్‌లోని కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ మాట్లాడుతూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2528 కేసులు కరోనా అనుమానిత కేసులు నమోదైనట్టు చెప్పారు. వీరిలో 2435 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు.ఇప్పటివరకు మొత్తం 223 అనుమానిత శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు. బుధవారం కొత్తగా మరో 153 కేసులు నమోదైనట్టు తెలిపారు.

English summary
A viral outbreak,new type of coronavirus,that began in China has infected more than 24,500 people globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X