వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఈ నాటిది కాదు..చైనా నుండి కాదు: మొదలైంది అక్కడ..నాడే వెలుగులోకి: ఆధారాలతో సహా...!

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇప్పుడు ప్రపంచంలో వేలాది మంది మరణానికి కారణమైన ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ - జనవరిలో ఈ వైరస్ బయటపడిందనేది ప్రస్తుతం పాలకులు చెబుతున్న మాట. దేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ అవ్వటానికి కారణమైన ఈ వైరస్ ఇప్పుడు పుట్టింది కాదు.

ఏడేళ్ల క్రితమే వెలుగులోకి కరోనావైరస్

ఏడేళ్ల క్రితమే వెలుగులోకి కరోనావైరస్

ప్రస్తుతం ప్రపంచ దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది కరోనావైరస్. అదేదో డిసెంబర్‌లో చైనాలో పుట్టిందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2013లోనే ఈ వైరస్ కారణంగా మరణాలు చోటు చేసుకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆస్పత్రిలో ఈ వైరస్ కారణంగా మరణాలు 2013 ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. నాడు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దిన పత్రిక 2013, ఫిబ్రవరి 20న కరోనా కారణంగా మృతుల సంఖ్య ఆరుకు చేరిందంటూ వార్త ప్రచురించింది. ప్రాణాంతక వైరస్ గా గుర్తించిన కరోనా గురించి మరి రీసెర్చ్ లు ఎక్కడా ఎందుకు జరగలేదు..వ్యాక్సిన్ పైన ఎందుకు ఫోకస్ చేయేలేదు..ఇంత మంది మరణించాక..ఇప్పుడు చేస్తున్న కట్టడి చర్యలు నాడే చేసి ఉంటే ఇంత నష్టం జరిగేదా...

2013 నాటికే కరోనా మరణాలు...

2013 నాటికే కరోనా మరణాలు...

కరోనా వైరస్ కారణంగా మరణాలు గత మూడు లేదా నాలుగు నెలల నుండి మొదలైంది కాదు. 2013లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. దీనికి కొత్తరకం వైరస్ కారణంగా తేల్చారు. ప్రముఖ తెలుగు దిన పత్రిక లో వచ్చిన వార్త పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పత్రిక ఇచ్చిన కథనం మేరకు కరోనావైరస్‌తో బ్రిటన్‌లో ఒకరు మృతి చెందారని ఆ వార్తలో రిపోర్ట్ చేసారు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రోగి మరణించారని.. గతేడాది మధ్య తూర్పు ప్రాంతంలో బయటపడిన ఈ కొత్తరకం వైరస్‌ బారిన పన్నెండు మంది పడ్డారని, వారిలో ఆరుగురు మృతి చెందారని పేర్కొంది. కొత్తగా సోకుతున్న ఈ రకం వైరస్ వ‌ల్ల‌ ప్రజానీకానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని, సాధారణ జలుబు, సార్స్‌, తీవ్రస్థాయి శ్వాసకోశ రుగ్మతలు దీని ల‌క్షణాలని పేర్కొంది. ఈ వైరస్‌ ఊపిరితిత్తుల‌ మార్గాల‌ పొరల్లోకి చొచ్చుకెళ్లి, రోగ నిరోధక వ్యవస్థపైదాడి చేస్తుందని, ఇది మానవ కణాల్లో సమర్థంగా పెరుగుతున్నట్లు స్విట్జర్లాండ్‌లోని కాంటోనల్‌ ఆసుపత్రి పరిశోధకులు హెచ్చరించిన విషయాన్ని ఆ పత్రిక 2013లోనే స్పష్టంగా ప్రచురించింది.

నాడు అప్రమత్తం కాకపోవటం..నేడు భారీ మూల్యం..

నాడు అప్రమత్తం కాకపోవటం..నేడు భారీ మూల్యం..

2013 ఫిబ్రవరిలోనే ఇంగ్లాండ్ లో ఈ వైరస్‌ను కరోనాగా గుర్తించారు. ఆ సమయంలోనే పత్రిక ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కానీ, దాని తీవ్రతను అప్పట్లో అంచనా వేయకపోవటం.. నిరోధక వ్యాక్సిన్ గురించి ఆసక్తి చూపించకపోవటంతో ఇప్పుడు ఏడేళ్ల కాలంలో ఆ వైరస్ తీవ్ర స్థాయికి చేరింది. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది. ఇక, మన దేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాక్ డౌన్ కు కారణమైంది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే సరైన మందు ఏంటనేది తేలలేదు. సోషల్ డిస్టన్స్ మాత్రమే నివారణ చర్యలుగా ప్రచారం చేస్తున్నారు.

లండన్ నుంచి ప్రచురితమైన వార్త

లండన్ నుంచి ప్రచురితమైన వార్త

చైనా నుండి గత డిసెంబర్ - జనవరి నుండి మొదలై ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విస్తరించిందంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతోంది. అయితే, తెలుగు స్థానిక పత్రికలోనే ఈ కరోనా కారణంగా మరణాల గురించి ఏడేళ్ల క్రితమే రిపోర్ట్ చేసారంటే ..మానవ తప్పిదం ప్రస్తుత పరిస్థితులకు కారణమా అనే చర్చ మొదలైంది. ఆ వార్త లండన్ నుండి నాడు ప్రచురితమైంది. ఇప్పుడు అదే లండన్ లో బ్రిటన్ ప్రధాని సైతం కరోనా బారిన పడ్డారు. మరి...ఇప్పుడు ఈ వ్యాధి ఈ స్థాయికి చేరే వరకూ ఎందుకు పట్టించుకోలేకపోయారు. ఎక్కడ తప్పు జరిగింది. నిర్లక్ష్యమా..అవగాహన రాహిత్యమా..కారణం ఏదైనా ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయింది.

English summary
As the whole world is talking about Coronavirus today, This deadly virus was known to the world 7years back. An article was carried in the Telugu leading daily on the same on February 20, 2013.Now the question is as why none could prepare the vaccine then.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X