దెయ్యం పట్టిందని కన్నకొడుకును బలి.. కానీ !
కాలం మారుతోంది.. మనుషులు దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ముసుగులో జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కుమారుడుకి దెయ్యం పట్టిందనే అనుమానంతో బలి ఇవ్వడానికి ఓ జంట సిద్ధపడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగిందంటే అనుకోవచ్చు కానీ ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో విద్యావంతులైన జంట పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్ నగరంలో ఫ్లోరియన్ లూనా, మేరీ లహాల్లే అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఒక మ్యూజిక్ స్కూల్‌ను నడుపుతూ ప్రఖ్యాత సంగీత విద్యావేత్తలుగా పేరొందారు. కానీ క్షుద్ర శక్తులు, మూఢ నమ్మకాలతో.. చిన్నారి అసహజంగా ప్రవర్తిస్తోందని భావించి బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అందుకు గాను బాలుడిని మోరాకోలోని ఎడారిలోకి తీసుకెళ్లి అక్కడ బలివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్లాన్ కోసం 2023 చివర్లో ప్రత్యేకంగా ఓ కారు కూడా కొన్నారు. కానీ ఆ విషయాన్ని ఫ్లోరియన్ లూనా తన బంధువుతో మాట్లాడుతూ ఓపెన్ అవ్వడంతో.. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టి ఆ దంపతులను అరెస్టు చేశారు. ఈ మధ్యే కోర్టులో ఈ కేసుపై విచారణ జరపగా.. దంపతుల తరపు న్యాయవాది మాట్లాడుతూ వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications