దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

మాల్యా అప్పగింతపై విచారణ ప్రారంభం, జడ్జి అంగీకరిస్తే రెండు నెలల్లో భారత్‌కు..

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లండన్: బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి, గత ఏడాది మార్చి నెలలో యూకే పారిపోయి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న లిక్కర్‌ టైకూన్ విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది.

  వచ్చే 10 రోజుల వరకు వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బత్నోట్ ఈ కేసుపై వాదనలు విననున్నారు. ఒకవేళ ఈ కేసులో విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరిస్తే రెండు నెలల్లో విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే అవకాశముంది.

  Court hearing to get Vijay Mallya back begins today: Will UK extradite him?

  భారత ప్రభుత్వం తరుఫున 'బ్రిటన్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసెస్‌' తన వాదనలను వినిపించనుంది. అదేవిధంగా మాల్యా తరుఫున క్లేర్‌ మాంట్‌ గోమెరీ వాదించనున్నారు.
  అంతర్జాతీయ క్రిమినల్‌ చట్టాలు, నేరస్తుల అప్పగింత వంటి కేసుల్లో క్లేర్‌కు ఏళ్ల అనుభవం ఉంది.

  ఈ కేసు వాదనలు ముగిసే సమయానికి అప్పగింతకు జడ్జి అంగీకరిస్తే, యూకే హోమ్‌ సెక్రటరీ అంబర్‌ రూడ్‌, మాల్యాను రెండు నెలల వ్యవధిలో భారత్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీచేయనున్నారు.

  ఈ విచారణలో టాప్‌ సీబీఐ అధికారులు, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా పాల్గొననున్నారు. స్కాట్‌లాండ్‌ యార్డు పోలీసులు గతంలో విజయ్ మాల్యాను లండన్‌లో అరెస్టు చేయగా, 650,000 పౌండ్ల పూచీకత్తుపై బెయిల్‌ పొంది బయటికి వచ్చాడు. 

  English summary
  A high-octane legal drama is set to be played out in the Westminster Magistrates Court from Monday. Can India finally succeed in putting together a case that holds up in a British court and secure the second extradition from the UK, 25 years after signing an extradition treaty? On the one side is Vijay Mallya, the most high-profile individual (requested person in legalese) sought by India so far. There are serious charges of financial irregularities against him; the total amount involved is significant by any standards (around or over Rs9000 crore or over a billion pounds); he has been arrested twice; but he remains defiant. On the other side is an uncharacteristically confident Indian government ( or requesting judicial authority). There has been a rare energy and attention to detail in recent months to prepare the paperwork.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more