వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే చంపారా?: అమెరికాలో చైనా ప్రొఫెసర్ హత్య, అగ్రరాజ్యంపై డ్రాగన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో కరోనావైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్త బింగ్ లియు(37) పెన్సిల్వేనియా రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. ఆయన పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన రాస్ టౌన్‌షిప్‌లోని తన నివాసంలో లియు శనివారం అనుమానితస్థితిలో శవమై కనిపించాడు.

తెలిసిన వ్యక్తే హత్య చేశాడు..

తెలిసిన వ్యక్తే హత్య చేశాడు..

హో గు(46) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. లియును కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హో మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. లియుకు మెడ, తల భాగంలో బుల్లెట్ గాయాలున్నాయని తెలిపారు. లియు, హోగులు ఒకరికి ఒకరు తెలుసని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతానికి లియుకు హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కాగా,

కరోనాపై పరిశోధనలు చేస్తున్న తరుణంలో..

కరోనాపై పరిశోధనలు చేస్తున్న తరుణంలో..

కరోనావైరస్ సోకినప్పుడు కణస్థాయిలో చోటు చేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజవేసిన సమయంలో లియు హత్యకు గురవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అమెరికాపై చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగా, అమెరికాలో పరిశోధనలు చేసే ముందు.. సింగపూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు లియు.

అందుకే చంపేశారా?

అందుకే చంపేశారా?

అమెరికా ల్యాబ్‌లోనే వైరస్ సృష్టించబడిందనే విషయాన్ని కనుగొనడం వల్లే ప్రొఫెసర్ లియును హత్య చేశారని చైనా సోషల్ మీడియా వేదిక వైబోలో ఓ చైనా యూజర్ పేర్కొనడం గమనార్హం. కరోనావైరస్ సృష్టికి సంబంధించిన వాస్తవాలను కనిపెట్టడం మూలంగానే అమెరికా లియును హత్య చేసిందని చైనా నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. లియు హత్య వెనుక ఏదో మిస్టరీ దాగుందని అంటున్నారు. చైనా మీడియా కూడా లియు హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

Recommended Video

Coronavirus Vaccine Within One Week : America
చైనా-అమెరికా పరస్పర ఆరోపణలు

చైనా-అమెరికా పరస్పర ఆరోపణలు

కరోనావైరస్‌ను వూహాన్ ల్యాబ్‌లోనే చైనా సృష్టించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోపాటు అగ్రరాజ్య వర్గాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అటు చైనా కూడా అమెరికాపై ఆరోపణలు చేస్తోంది. అమెరికా ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే, చైనా కరోనా తీవ్రతను దాచడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా భారీగా మరణాలు సంభవిస్తున్నాని, ఇందుకు ఆ దేశమే బాధ్యత వహించాలంటూ అమెరికా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Coronavirus: Professor Bing Liu's murder fuels wild theories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X