వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

covid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విలయాన్ని అడ్డుకునే ఏకైక వజ్రాయుధం వ్యాక్సినే అని మెజార్టీ సైంటిస్టులు చెబుతున్నా, దాదాపు అన్ని దేశాలూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసినా, ఇప్పటికీ టీకాలపై నెలకొన్న సందేహాలు తీరడంలేదు. కొవిడ్ వల్ల పురుషుల్లో సెక్స్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోయి వంధత్వానికి దారి తీస్తుందని, సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషించే వీర్య కణాల సంఖ్య తగ్గుతుందనే అనుమానాల నేపథ్యంలో వ్యాక్సిన్లపైనా వింత భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎన్నో ప్రశ్నలకు తాజా అధ్యయనంలో సమాధానాలు లభించాయి.

అనూహ్యం: BJP ఎంపీతో సూరీడు భేటీ -YSR నీడను కలిశా: ధర్మపురి అరవింద్ -ys sharmilaపై చర్చా?అనూహ్యం: BJP ఎంపీతో సూరీడు భేటీ -YSR నీడను కలిశా: ధర్మపురి అరవింద్ -ys sharmilaపై చర్చా?

చైనా స్టడీతో బెంబేలు..

చైనా స్టడీతో బెంబేలు..

కరోనా పుట్టినిల్లు చైనాలోనే కొవిడ్ ప్రభావంపై తొలుత నెగటివ్ ప్రచారం జరిగింది. కోవిడ్ సోకిన వారిలో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గి.. వంధ‌త్వం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో చైనీస్ సైంటిస్టులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆరుగురు క‌రోనా రోగుల డేటా ఆధారంగా చైనా ప‌రిశోధ‌కులు ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని కేసుల్లో వృష‌ణాల్లో వాపు వ‌చ్చిన‌ట్లు కూడా తేలింది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌వారిలో 39 శాతం మందిలో స్పెర్మ్ కౌంట్ త‌గ్గిన‌ట్లు అంచ‌నా వేశారు. 61 శాతం మందిలో .. వారి వీర్య‌క‌ణాల్లో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరిగిన‌ట్లు గుర్తించారు. లైంగిక పటుత్వంపై చైనీస్ సైంటిస్టుల స్టడీ ప్రభావం తర్వాతి కాలంలో వ్యాక్సిన్లపైనా పడింది..

Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?

అమెరికా అధ్యయంలో ఇలా..

అమెరికా అధ్యయంలో ఇలా..

చైనీస్ స్టడీ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ల పట్ల అగ్రరాజ్యమైన అమెరికాలో ఓ భ‌యం వ్యాపించింది. వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతోందని, స్పెర్మ కౌంట్ కూడా పడిపోతున్నదని జ‌నం భయపడ్డారు. వీటిపై ప్రఖ్యాత మియామీ వ‌ర్సిటీ కీలక అధ్యయనం జరిపింది. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల పురుష‌ల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గ‌డంగానీ, వీర్య కణాల సంఖ్య తగ్గడంగానీ జరగలేదని తాజా అధ్యయనంలో తేలింది. రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న‌వారిలో లైంగికపరమైన దుష్ప్రభావాలేవీ కనిపించలేదని, మొత్తం 45 మంది పురుషుల‌పై ఈ అధ్య‌య‌నం చేశామని, వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, ఆ త‌ర్వాత వారి లైంగిక సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించిమరీ ఈ నిర్ధారణకు వచ్చామని మియామీ వర్సిటీ పేర్కొంది.

Recommended Video

Journalist Raghu Press Meet జర్నలిజాన్ని తొక్కేసే కుట్ర జరుగుతుంది.. భయపడను
వ్యాక్సిన్ -సెక్స్ సామర్థ్యం..

వ్యాక్సిన్ -సెక్స్ సామర్థ్యం..


కొవిడ్ టీకాకు ముందు, తర్వాత లైంగిక సామ‌ర్థ్య ప‌రీక్ష‌లో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైట‌జ‌ర్ టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారని, ఈ రెండు టీకాల‌ను ఎంఆర్ఎన్ఏ విధానంలో త‌యారు చేసినవేకాగా, వాటిని తీసుకున్న వ్యక్తుల్లో వీర్య‌క‌ణాల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో.. బేస్‌లైన్ స్పెర్మ్ కాన్‌సెంట్రేష‌న్‌, టోట‌ల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియ‌న్లు/ఎంఎల్‌, 36 మిలియ‌న్లు ఉన్న‌ట్లుగా నిర్ధారణ అయిందని అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే, రెండో డోసు తర్వాత వారిలో వీర్య‌క‌ణాల సంఖ్య స్వ‌ల్పంగా 30 మిలియ‌న్లు/ఎంఎల్, టోట‌ల్ కౌంట్ 44 మిలియ‌న్ల‌కు పెరిగిన‌ట్లు గుర్తించారు. టీకా తీసుకున్న త‌ర్వాత ఎంత ప‌రిమాణంలో వీర్యం ఉత్ప‌త్తి అవుతున్న‌ది, వీర్య‌క‌ణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో స్ట‌డీలో నిర్ధారించారు. సీమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు. అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ జ‌ర్న‌ల్‌లో ఈ నివేదిక‌ను ప్ర‌చురించారు.

English summary
As contrary to the unsubstantiated claims circulating on social media, scientists at the University of Miami have found that the COVID-19 vaccine does not harm male fertility, or reduce the sperm count in healthy young males. According to a study published June 17, in the scientific journal JAMA, the researchers accumulated samples from men aged 18 to 50 in an in-vitro fertilization center between February and March post-vaccination in Israel. They analyzed data of the 43 vaccinated male patients and compared it with the data prior to when these males were jabbed with two mRNA vaccines, BNT162b2 (Pfizer-BioNTech) and mRNA-1273 (Moderna). It was found that the men reported no underlying fertility issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X