కరోనా వ్యాక్సిన్లతో మనుషులు చింపాజీలుగా మారతారా ? 300 అకౌంట్స్ సీజ్ చేసిన ఫేస్ బుక్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లపై ఎంత పాజిటివ్ ప్రచారం జరుగుతందో అంతే నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ర్ పై సోషల్ మీడియాతో పాటు బహిరంగంగానూ దుష్ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఫేక్ న్యూస్ ను ఫేస్ బుక్ లో ఖాతాదారులు వివరీతంగా షేర్ చేస్తున్నారు. అదేంటో తెలిస్తే షాకవ్వడం ఖాయం.
కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే మనుషులు చింపాంజీలుగా మారతారంటూ ఫేస్ బుక్ లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకా, అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్లు వేసుకుంటే మనుషులు చింపాజీలు అవుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత్, లాటిన్ అమెరికా, యూఎస్ లో యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రచారం సాగుతున్నట్లు ఫేస్ బుక్ గుర్తించింది. రష్యాకు చెందిన డిసిన్ఫర్మేషన్ నెట్ వర్క్ ల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు ఫేస్ బుక్ గుర్తించింది.

గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకుంటే చింపాంజీలుగా మారతారంటూ రష్యాకు చెందిన డిస్ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ విపరీతంగా ప్రచారం చేసింది. కొంతకాలం తర్వాత ఈ ఖాతా నుంచి పోస్టులు ఆగిపోయాయి. ఐదు నెలల తర్వాత ఈ ఏడాది మే నెలలో మరోసారి ఈ ప్రచారం మొదలైంది. ఇందులో ఫైజర్ వ్యాక్సిన్ సమర్ధతతో పాటు దీని వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను ఆస్ట్రాజెనెకా నుంచి దొంగిలించిన ఓ డాక్యుమెంట్ ను ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నట్లు తేలింది.
కరోనా వ్యాక్సిన్లపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించిన ఫేస్ బుక్.. 65 ఎఫ్ బీ ఖాతాల్ని, అలాగే 243 ఇన్ స్టా గ్రామ్ ఖాతాల్ని తొలగించినట్లు ప్రకటించింది. తమ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నందు వల్లే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్డడించింది. ఈ రష్యన్ సోషల్ మీడియా నెట్ వర్క్ 12 ప్లాట్ ఫామ్స్, ఫోరమ్స్ ద్వారా ఆపరేట్ అవుతున్నట్లు ఫేస్ బుక్ గుర్తించింది. దీంతో దాదాపు 300కు పైగా ఖాతాల్ని తొలగించినట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications