• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్ నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..

By BBC News తెలుగు
|

కోవిడ్

కరోనా వ్యాక్సీన్లకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు.

అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న టీకాలకు నకిలీలు మార్కెట్‌లోకి వచ్చాయి.

ఈ విషయాన్ని ఫైజర్ ధ్రువీకరించింది.

రెండు దేశాల్లో తమ టీకా నకిలీ వెర్షన్‌ను గుర్తించామని ఫైజర్ చెప్పింది. నకిలీ టీకాలను అధికారులు సీజ్ చేశారు. అవి నకిలీవేనని పరీక్షల్లో తేలింది.

"మెక్సికోలో ఫైజర్ టీకాకు తప్పుడు లేబుళ్లు అంటించారు. పోలండ్‌లో బయటపడిన నకిలీ వ్యాక్సీన్‌లో ముడతల నివారణ చికిత్సలో వాడే మెడిసిన్ ఉన్నట్లు నమ్ముతున్నాం" అని ఫైజర్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి నకిలీ వ్యాక్సీన్లు పెద్ద సమస్యగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

నకిలీ టీకాలను గుర్తించి వెంటనే వాటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నకిలీ వ్యాక్సీన్ల గురించి మనకేం తెలుసు

రెండు దేశాల్లో చేపట్టిన వేర్వేరు దర్యాప్తుల్లో ఈ నకిలీ వ్యాక్సీన్ల బాగోతం బయటపడింది.

మెక్సికోలో సుమారు 80 మందికి ఈ నకిలీ టీకాలు వేశారు. అయితే, వారిలో సైడ్ ఎఫెక్టులు వచ్చినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

అయితే, ఈ ఫేక్ టీకా తీసుకోవడం వల్ల వారికి కోవిడ్ నుంచి ఎలాంటి రక్షణ లభించదు.

కోవిడ్

నకిలీ వ్యాక్సీన్ల విషయం ఎలా బయటపడింది?

సోషల్ మీడియాలో ఈ నకిలీ టీకాలను ఒక్కోటి సుమారు లక్షా 80 వేల రూపాయలకు విక్రయించడానికి కొందరు ప్రయత్నించారని, సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా ఈ స్కామ్‌ను ఛేదించి, పలువురిని అరెస్ట్ చేశారని మెక్సికో ప్రభుత్వ ప్రతినిధి లోపెజ్ చెప్పారు.

ఒక వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో నకిలీ వ్యాక్సీన్లు లభించాయని పోలండ్ అధికారులు చెప్పారు. ఈ ఫేక్ టీకాలు ఎవరికీ వేయలేదని వారు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్లకు డిమాండ్ పెరగడం.. దానికి తగ్గట్టుగా సప్లయి లేకపోవడంతో నకిలీ టీకాలను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఫైజర్ గ్లోబల్ సెక్యూరిటీ హెడ్ లెవ్ కుబియక్ చెప్పారు.

టీకాలు చాలా తక్కువగా సప్లయి చేస్తున్నాం. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సీన్ తయారీలోకి దిగితే డోసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు అని ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెప్పారు.

మెక్సికో, పోలండ్‌లో నకిలీ వ్యాక్సీన్లు దొరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా న్యాయశాఖ ఏబీసీ న్యూస్‌కు చెప్పింది. ఫైజర్‌కు,స్థానిక అధికారులకు అవసరమైన సాయం అందిస్తామని వివరించింది.

భారతదేశంలో ఫైజర్ కోవిడ్ టీకాలను వేయడం లేదు. కాబట్టి ఇక్కడి వాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid Fake Vaccines:Fake Corona Vaccines Sold On Social Media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X