చైనాలో కోవిడ్ కల్లోలం- బీజింగ్ లో అంత్యక్రియలు నిర్వహించే వారూ కరవు.. !

చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కల్లోలం రేపుతోంది. దేశంలో కోవిడ్ కారణంగా ఇప్పటికే వేలాదిగా నమోదవుతున్న కేసులతో జనం, ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రాజధాని బీజింగ్ లో పరిస్ధితి మరీ దారుణంగా మారుతోంది. ఆరోగ్య సిబ్బంది కూడా భారీస్ధాయిలో కోవిడ్ బారిన పడటంతో అక్కడ శవాలకు అంత్యక్రియలు నిర్వహించేవారే కరువయ్యారు.

చైనాలో కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ బలహీనపడుతున్న సంకేతాలు వెలువడినా ఇప్పటికే సోకిన రోగుల సంఖ్య భారీగా ఉందగి. దీంతో సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, అంబులెన్స్ ల డ్రైవర్లు భారీగా కోవిడ్ బారిన పడ్డారు. దీంతో కోవిడ్ తో చనిపోయిన వారి శవాల్ని కుటుంబ సభ్యులు తీసుకోలేక, అలాగని ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేక బీజింగ్ లో దారుణమైన పరిస్దితులు తలెత్తుతున్నాయి. భారీగా ఆరోగ్య సిబ్బంది, డ్రైవర్లు కోవిడ్ బారిన పడటంతో అంత్యక్రియల సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

covid pandemic at peak in beijing-no workers even for funeral of bodies

గతంలో కోవిడ్ 19 తొలిసారి బయటపడినప్పుడు ప్రపంచానికి తన మార్క్ లాక్ డౌన్ లు, పరీక్షలు, ప్రయాణ ఆంక్షలతో దారి చూపిన చైనాలో ఇప్పుడు పరిస్దితులు అలా కనిపించడం లేదు. లాక్ డౌన్ విధిద్దామంటే ప్రజలు ఒప్పుకోవడం లేదు. అలాగని వదిలేస్తే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కొత్తగా మందులేవీ అందుబాటులోకి రావడం లేదు. దీంతో అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా అనాథ శవాల్ని ఎక్కడికక్కడే వదిలేయాల్సిన దుస్ధితి దాపురిస్తున్నట్లు తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+