40 లక్షలమందిని మింగేసిన కరోనా: వైరస్ మరణాల్లో టాప్-5 కంట్రీస్ ఇవే

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా మరణాల సంఖ్య ఇదివరకట్లా దూకుడుగా కొనసాగనప్పటికీ.. పూర్తి స్థాయిలో బ్రేకులు పడట్లేదు. మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైన అగ్రదేశాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్నాయి. అయినప్పటికీ- మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతోన్నాయి.

40 లక్షల మంది బలి..

40 లక్షల మంది బలి..

ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు రాయటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా 17,81,83,639 నమోదయ్యాయి. ఈ 4 లక్షల మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికోలది 50 శాతం వాటా ఉంది. పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిపబ్లిక్, జీబ్రాల్టర్‌లల్లో ఈ కరోనా మరణాలు రేటు అధికంగా ఉంటోంది. ఆయా దేశాల జనాభా, వైరస్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చుకుంటే.. మరణాలు అక్కడ అధికంగా ఉంటోన్నాయి.

 లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఛిన్నాభిన్నం..

లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఛిన్నాభిన్నం..

ప్రత్యేకించి- లాటిన్ అమెరికా దేశాలు వైరస్ బారిన పడి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 43 మంది లాటిన్ అమెరికా దేశస్థులేనని రాయటర్స్ తెలిపింది. ఈ రీజియన్‌కు చెందిన తొలి తొమ్మిది దేశాల్లో- వారం రోజులుగా కరోనా మరణాలు మరింత అధికమైనట్లు పేర్కొంది. బొలీవియా, చిలీ, ఉరుగ్వేల్లో కరోనా బారిన పడిన పేషెంట్లలో 25 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న వారు అధికంగా ఉంటోన్నారు. ప్రత్యేకించి- బ్రెజిల్ రాజధాని సావోపోలోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల్లో 80 శాతం కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి.

శ్మశానాలు ఫుల్

శ్మశానాలు ఫుల్

కరోనా మరణాతో లాటిన్ అమెరికా సహా పలు దేశాలు కొత్తగా శ్మశానాలను విస్తరించుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్లు రాయటర్స్ తెలిపింది. అనేక దేశాల ప్రభుత్వాలు శ్మశానాల కోసం ఇదివరకెప్పుడూ లేనంతగా స్థలాలను కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది. రోజురోజుకూ మరణాలు పెరుగుతోండటంతో సముద్ర తీర ప్రాంతాలు, పార్కులు, జన సంచారం పెద్దగా లేని చోట్ల మృతదేహాలను ఖననం చేయడానికి అనుమతులను మంజూరు చేశాయి.

ఆ విషయంలో భారత్ టాప్

ఆ విషయంలో భారత్ టాప్

వారం రోజుల్లో చోటు చేసుకున్నమరణాలు సగటును పరిగణనలోకి తీసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. రెండున్నర నెలలుగా భారత్‌లో కరోనా మరణాలు రెండు నుంచి నాలుగు వేల వరకు నమోదైన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో మరణాల సంఖ్య మరే దేశంలోనూ నమోదు కాలేదు. గరిష్ఠంగా ఒక్కరోజు వ్యవధిలో నాలుగు వేలకు పైగా కోవిడ్ సంబంధిత మరణాలు భారత్‌లో నమోదయ్యాయి. వాటి సంఖ్య ప్రస్తుతం రెండువేలకు పైగా కొనసాగుతోంది. వారం రోజుల సగటులో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడా ఇదే తరహా దుస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+