వరల్డ్ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్.. 90 నిమిషాల్లోనే హైదరాబాద్ TO వైజాగ్..!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. మారుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడంలో చైనా ముందుంటోంది. ఇప్పటికే చైనా.. ఎన్నో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. తాజాగా రైల్వే వ్యవస్థలో డ్రాగన్ కంట్రీ నూతన అధ్యాయానికి తెర తీసింది. బుల్లెట్ రైలు అంటే ఇప్పటి వరకూ జపాన్ పేరు మాత్రమే మనకు గుర్తొచ్చేంది. ఈ మేరకు ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ సేవల కోసం జపాన్ తో భారత్ ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ లో చైనా కొత్త రికార్డును సృష్టించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలు ఇప్పుడు చైనాలో ఉంది. ఈ విషయంలో చైనా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. చైనా రూపొందించిన న్యూ హై స్పీడ్ ట్రైన్ CR450 ఈ రికార్డును సాధించింది. గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని ఈ రైలు అందుకోవడం విశేషం. దీంతో CR450 బుల్లెట్ రైలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలుగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలును షాంగై- చెంగ్డూ రైల్వే లైనుపై టెస్టింగ్ నిర్వహించారు.

చైనాకు చెందిన లేటెస్ట్ బుల్లెట్ ట్రైన్ CR450.. ఇప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హై స్పీడ్ రైలుగా రికార్డు నెలకొల్పింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్ లో ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ రైలును టెస్టింగ్ చేస్తున్నారు. త్వరలో ప్రజా సేవలో వినియోగించనున్నారు. దీని కమర్షియల్ స్పీడ్ గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది. ఇదివరకు ఇదే సిరీస్ లో ఉన్న రైలును ఇప్పుడు లేటెస్ట్ రైలు అధిగమించింది.

స్మార్ట్ డిజైన్.. ఫాస్టర్ ట్రైన్..

ఈ రైలు ఆకారం పొడవాటి ముక్కులా ఉంటుంది. ఇది 15 మీటర్లు ఉంటుంది. ఈ డిజెన్ కారణంగా ఎదురుగాలి నుంచి తప్పించుకుంటుంది. గాలిని చొచ్చుకునిపోయేలా ట్రైన్ ఇంజిన్ ముందు భాగాన్ని డిజైన్ చేశారు. ఈ రైలు రూఫ్ లైన్ 20 మీటర్లు ఉంటుంది. పాత మోడల్ రైలు కంటే 55 టన్నుల బరువు తక్కువగా ఈ బుల్లెట్ రైలును నిర్మించడం విశేషం. ఈ మార్పుల కారణంగా ఏరో డైనమిక్ రెసిస్టెన్స్ ను 22 శాతం తగ్గించి స్పీడును పెంచుతుంది. అలాగే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ CR450 బుల్లెట్ రైలు జీరో నుంచి ప్రారంభమై కేవలం 4 నిమిషాల 40 సెకన్లలోనే గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందిపుచ్చుకుంటుంది. CR400 బుల్లెట్ రైలుతో పోలిస్తే ఇది 100 సెకన్లు ఫాస్ట్ కావడం విశేషం. ట్రయల్ రన్ లో రెండు CR450 బుల్లెట్ రైళ్లు కలిసి గంటకు 896 కిలోమీటర్ల వేగాన్ని తాకాయి. ఇప్పటివరకు ఉన్న రికార్డుల్ని ఈ రైలు చెరిపివేసింది. ప్రస్తుతం ఇంజినీర్లు ఈ బుల్లెట్ రైలుకు ఇతర టెస్టింగ్ లు చేస్తున్నారు. ఈ రైలు ఎరో డైనమిక్ మూవ్ మెంట్స్ కోసం చైనా ఇంజినీర్లు దాదాపు 5 ఏళ్లపాటు శ్రమించారు. స్పోర్ట్స్ కారులోని డిజైన్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ రైలును నిర్మించారు.

CR450 Blazes Past All China s 453 km h Bullet Train Crowned World s Fastest in 2025

ఈ వేగంతో హై- స్పీడు రైలులో చైనా నూతన అధ్యాయం లిఖించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జపాన్, జర్మనీ, భారత్ దేశాలు తమ సొంత రైల్వే వ్యవస్థలను మెరుగుపరుచుకుంటున్నాయి. భారత్ లో ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో చైనాలోని CR450 బుల్లెట్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భూమి మీద అత్యంత సామర్థ్యం గల రైలుగా ఇది నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+