• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బుజ్జాయిల హీరో: స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టీవ్ డిట్కో ఇక లేరు

|
  మరణించిన స్పైడర్ మ్యాన్ సృష్టికర్త

  మీ పిల్లలు ఎప్పుడూ స్పైడర్ మ్యాన్ గురించి అడుగుతుంటారా...? పడుకునేముందు స్పైడర్ మ్యాన్ కథలను చెప్పమని మిమ్మలను అడుగుతారా...? ఆ సమయంలో స్పైడర్ మ్యాన్ గురించి ఏదో ఒక కథ చెప్పేసి పిల్లలను బజ్జో పెడుతాము. అయితే అసలు స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ సృష్టించింది ఎవరో మీకు తెలుసా... చాలామందికి స్పైడర్ మ్యాన్‌ను సృష్టించింది స్టీవ్ డిట్‌కో అనే ఆర్టిస్ట్ అని తెలియదు. తెలుసుకునే సమయానికి ఆయన ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు. అవును ... స్పైడర్ మ్యాన్ సృష్టి కర్త స్టీవ్ డిట్కో ఇక లేరు. మృతిచెందే సమయానికి ఆయన వయసు 90 ఏళ్లు.

  90 ఏళ్ల స్టీవ్ డిట్కో న్యూయార్క్‌లోని అతని అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గమనించినట్లు తెలిపారు. ఆయన జూన్ 29నే మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రపంచానికి మాత్రం ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. స్టీవ్ ఎలా మృతి చెందాడో అనేది వారు స్పష్టం చేయలేదు.

   Creator of Spiderman Steve Ditko passes away at 90

  1961లో డిట్కో అతని మిత్రుడు స్టాన్‌లీతో కలిసి స్పైడర్ మ్యాన్ అనే కారికేచర్‌కు ప్రాణం పోశారు. స్టాన్‌లీ మార్వెల్ కామిక్స్‌కు ఎడిటర్ ఇన్ ఛీఫ్‌గా ఉన్న సమయంలో ఒక టీనేజ్ సూపర్ హీరోను క్రియేట్ చేయాల్సిందిగా డిట్కోకు బాధ్యతలు అప్పగించాడు. వెంటనే ఇదే పనిపై కూర్చున్న డిట్కో తన క్రియేటివిటీని ఉపయోగించి స్పైడర్ మ్యాన్‌ను సృష్టించాడు. స్పైడర్ మ్యాన్‌కు ఎరుపు మరియు నీలం రంగు దుస్తులు డిజైన్ చేశాడు. సాలెపురుగు గూడులా వీటిని రూపొందించాడు. ఈ కార్టూన్‌ను తమ కామిక్స్‌లో పబ్లిష్ చేయగానే విపరీతమూన క్రేజ్ వచ్చింది. కామిక్ సూపర్ హిట్ అయ్యింది. భారీ లాభాలు తీసుకొచ్చి పెట్టింది. అదే కార్టూన్‌ వినియోగించి సినిమాలు సైతం దర్శనమిచ్చాయి. డాక్టర్ ఆక్టోపస్, శాండ్ మ్యాన్, లిజర్డ్ అండ్ గ్రీన్ గాబ్లిన్ అనే క్యారెక్టర్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ ఘనత డిట్కోకే దక్కుతుంది.

  మార్వెల్ కామిక్స్ బాగా రన్ అవుతున్న సమయంలో స్టాన్‌లీతో విబేధాలు రావడంతో మార్వెల్ కామిక్స్‌కు డిట్కో గుడ్ బై చెప్పేశాడు. అయితే విబేధాలను పరిష్కరించుకునేందుకు డిట్కో ప్రయత్నించలేదు.. అదే సమయంలో స్టాన్‌లీ కూడా ప్రయత్నించలేదు. ఆ తర్వాత డిట్కో చార్ల్‌టన్, డీసీ కామిక్స్ ఇతర స్వతంత్ర పత్రికలకు పనిచేశారు. తిరిగి 1979లో సొంత గూడు మార్వెల్ కామిక్స్‌కు చేరుకున్నారు. అక్కడ మెషీన్ మ్యాన్, మైక్రోనాట్స్ డిజైన్ చేశాడు. 1990వరకు ఫ్రీలాన్సర్‌గా చేశాడు. 1992లో తాను రూపొందించిన స్క్విరిల్ గర్ల్ తన చివరి క్రియేషన్.

  ఇక తనకంటూ మాన్‌హటన్ పేరుతో ఒక సొంత స్టూడియోని స్థాపించి అక్కడే బొమ్మలు వేయడం రాయడంలాంటివి చేశాడు. తన చివరి శ్వాస వరకు అక్కడే ఉన్నారు. అయితే ఆ స్టూడియోలోకి వెళ్లిన తర్వాత ఎన్ని కార్టూన్లు డిట్కో వేశారో ఎన్ని పబ్లిష్ అయ్యాయో స్పష్టంగా తెలియదు. చివరి క్షణంలో ఆయనకు తోడంటూ ఎవరూ లేరు. కనీసం ఆయన బంధువులు కూడా ఎవరో తెలియదు. డిట్కో వివాహం చేసుకోలేదని తెలుస్తోంది.

  డిట్కో మరణం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు చాలా బాధపడ్డారు. డిట్కో ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. డిట్కో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లినప్పటికీ... ఆయన ప్రాణం పోసిన స్పైడర్ మ్యాన్ ఉన్నంత వరకు డిట్కో బతికే ఉంటాడు... రెస్ట్ ఇన్ పీస్ స్టీవ్ డిట్కో....

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The creator of Spiderman artist Steve Ditko passed away at the age of 90. Ditko was found dead in his apartment on June 29 and it is believed he died about two days earlier.The cause of death was not anounced.In 1961, Ditko and Lee created Spider-Man. Lee, the editor-in-chief at Marvel Comics.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more