• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cricket-Mankading: భారత జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించిన ఈ అవుట్‌ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు రెండుగా చీల్చింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అవుట్‌కు అప్పీల్ చేస్తున్న దీప్తి శర్మ

లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మధ్య శనివారం జరిగిన మూడో వన్డే ఝూలన్ గోస్వామికి చివరి వన్డే.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందే గోస్వామి గురించి చర్చ జరిగింది. ఈ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఆమెకు ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. ఈ సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో గెలుచుకుంది.

కానీ, ఝూలన్‌తో పాటు మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అది శనివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చివరి వికెట్‌. ఈ వికెట్ తీయడం క్రీడా స్ఫూర్తి అవుతుందా కాదా అన్నదానిపై క్రికెట్ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఝూలన్ గోస్వామికి ఇది ఆఖరి మ్యాచ్

మ్యాచ్‌లో ఏం జరిగింది?

నిజానికి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగింది. ఈ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌ను 3-0తో ఓడించడం భారత జట్టుకు గొప్ప విషయమే.

ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మ్యాచ్‌లో చాలా పటిష్ట స్థితిలో ఉంది. కానీ, 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా ఇంగ్లండ్ జట్టు కూడా ఏమాత్రం తొణకలేదు.

ముఖ్యంగా చార్లీ డీన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టింది. ఇంగ్లండ్‌ జట్టు 118 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అయినా, ఇంకా పోరాడగలనన్న దీమ డీన్‌లో కనిపించింది. కావలసినన్ని ఓవర్లు కూడా ఉన్నాయి.

డీన్, ఫ్రెయా డేవిస్ చివరి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఇంగ్లండ్‌ను గెలిపిస్తారేమో అనిపించింది.

కానీ, 44వ ఓవర్‌లో జరిగిన ఘటన మ్యాచ్‌ను తలకిందులుచేసింది. దీనిపై క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది.

వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0 తేడాతో గెల్చుకుంది

న్‌కడింగ్ చేసిన బౌలర్ దీప్తిశర్మ

ఆ ఓవర్‌లో దీప్తి శర్మ బౌలింగ్ చేస్తున్నారు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్, దీప్తి శర్మ బంతి వేయకముందే క్రీజు వదిలి ముందుకు కదిలింది. దీంతో దీప్తి శర్మ వికెట్లను బాల్‌తో కొట్టి ఔట్‌‌కు అప్పీల్ చేసింది.

చార్లీ డీన్ క్రీజు వదిలి చాలా దూరం వెళ్లినట్లు కనిపించింది. అంపైర్ దానిని థర్డ్ అంపైర్‌ నిర్ణయానికి పంపగా, చార్లీ డీన్‌ అవుటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించారు. భారత జట్టు అభిమానులు స్టేడియాన్ని నినాదాలతో హోరెత్తించారు.

అయితే, ఈ మ్యాచ్‌కు కామెంటరీ అందిస్తున్న మాజీ క్రికెటర్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావడం మొదలైంది.

ఇలా అవుట్ చేయడాన్ని క్రికెట్‌లో మన్‌కడింగ్ అంటారు. గతంలో భారత క్రికెటర్ వినూ మన్కడ్ ఒక బ్యాటర్‌ను ఈ విధానంలో అవుట్ చేసిన దగ్గర్నుంచి దీనిని మన్‌కడింగ్ అంటున్నారు.

ఝూలన్ గోస్వామి రిటైర్మెంట్ వార్తతోపాటు, అంపైర్ నిర్ణయంపై చర్చ మొదలైంది. దీప్తి శర్మ డీన్‌ను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడం ప్రారంభించింది.

అయితే నాన్‌స్ట్రైకర్ చార్లీ డీన్‌ను రనౌట్ చేయడం ద్వారా దీప్తి శర్మ తప్పు చేశారా? నిబంధనల ప్రకారం ఎంత మాత్రం తప్పుకాదు.

భారత మహిళల జట్టు

గత అనుభవాలు

గతంలో కూడా కొందరు ఆటగాళ్లు ఇలా రనవుట్ అయ్యారు. అయితే, తాజా ఘటన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు, అనైతికమని మరికొందరు పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి ఉండాల్సింది కాదని ఓ వ్యాఖ్యాత అన్నారు.

అయితే, ఐసీసీ ఇలాంటి అవుట్‌లను ఇటీవలే సమర్థించింది. ఐసీసీ ఈ మధ్య విడుదల చేసిన కొన్ని క్రికెట్ నిబంధనలలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఈ విషయంపై వస్తున్న విమర్శలకు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నుంచి సమాధానం వచ్చింది.

''మేం ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించ లేదు. నా జట్టు ఆటగాళ్లు చేసిన పనిని నేను సమర్ధిస్తున్నాను. వారు ఎలాంటి తప్పు చేయలేదు. కష్టపడి ఆడి గెలిచాం'' అని ఆమె అన్నది.

https://twitter.com/Cricketracker/status/1573735344142520320

క్రికెట్ గణాంకాలను ట్రాక్ చేసే మజర్ అర్షద్ ట్విట్టర్‌లో ఇలా రాశారు.

''ఇది తప్పు అనలేం. అయితే, ఆటలో కొందరు దీన్ని తప్పుడు ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. దీని నుంచి ప్రయోజనం పొందాలని బ్యాటర్ ప్రయత్నించారు. వెల్‌డన్ దీప్తి శర్మ'' అని వ్యాఖ్యానించారు.

కానీ, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ ఇది నిబంధనల ప్రకారం కరెక్టేనని, కానీ, నైతికంగా సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవుట్ ఇవ్వడం కన్నా, వార్నింగ్‌లు, పెనాల్టీ రన్స్ ఇచ్చేలా నిబంధనలు మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

https://twitter.com/MazherArshad/status/1573720951505784833

అయితే, గతంలో బౌండరీ కౌంట్ మీద ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు సమర్ధించిన వాళ్లే ఇప్పుడు దీప్తి శర్మను తప్పుబడుతున్నారని మరికొందరు ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

'బెన్ స్టోక్స్ లెజెండ్ అయితే, దీప్తి శర్మ కూడా లెజెండ్’ అని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో రాశారు.

https://twitter.com/sambillings/status/1573723981072539650

2019 ప్రపంచకప్ ఫైనల్‌లో ఏం జరిగింది

2019లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, ప్రపంచ చాంపియన్ టైటిల్ ఎవరికి ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తింది.

ఒక ప్రత్యేక నియమం ద్వారా విజేతను నిర్ణయించడం క్రికెట్ చరిత్రలో బహుశా అదే మొదటిసారి. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించాలన్నది ఆ నియమం.

https://twitter.com/katthikathir/status/1573736642703028224

ఈ ప్రత్యేక నియమం ప్రకారం, ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ చాంపియన్ అయ్యింది. న్యూజిలాండ్ అభిమానులు నిరాశ చెందారు. ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై క్రికెట్ అభిమాన ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయింది.

ఇంగ్లండ్‌కు మద్దతు ఇచ్చిన అభిమానులు "రూల్ ఈజ్ ది రూల్" అని వాదించారు. ఓడిపోయిన జట్టు అభిమానులు మాత్రం అత్యధిక బౌండరీల నియమం అన్యాయమని వాదించారు.

ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు కూడా ఇంగ్లండ్‌కు ఆ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేస్తూ, రూల్‌ అంటే రూలేనని, ఇందులో తప్పు లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cricket-Mankading: Why did the Indian team's decision to defeat England split the cricket world in two?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X