ఎదురుచూసి, కాన్వాయ్‌ను వెంటాడా: ట్రంప్‌పై బ్రిస్క్‌మ్యాన్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే తాను ఆ రోజు అతడిని హెచ్చరించానని బ్రిస్క్‌మ్యాన్ ప్రకటించారు. గత నెల 28వ, తేదిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్‌ను వెంబడించి అధ్యక్షుడికి వేలు చూపిస్తూ హెచ్చరించిన బ్రిస్క్‌మ్యాన్ ఉద్యోగాన్ని కూడ పోగోట్టుకొంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే తాను ఈ చర్యకు పాల్పడినట్టు చెప్పారు.

గత నెల 28వ, తేదిన అమెరికా అధ్యక్షుడు గోల్ప్ మైదానానికి వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌ను వెంటాడుతూ బ్రిస్క్‌మ్యాన్ వేలు చూపిస్తూ హెచ్చరించింది. ఈ ఫోటోను ఓ మీడియో ఫోటో‌గ్రాఫర్ ఫోటో తీసి సోషల్ మీడియోలో పోస్ట్‌ చేశారు.

ఈ ఫోట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు బ్రిస్క్‌మ్యాన్ సాహసాన్ని అభినందించారు. అయితే ఎట్టకేలకు ఆమె ఎవరో గుర్తించారు. ఈ విషయం తెలుసుకొన్న బ్రిస్క్‌మ్యాన్ ఉద్యోగం చేస్తున్న సంస్థ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. అయితే దీంతో మరోసారి ఆమె వార్తల్లోకెక్కారు.

ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేశాను

ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేశాను

గత అక్టోబర్ 28న తన కాన్వాయ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నేను అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తున్నాను. కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్‌ వాహనాన్ని చేరుకోగానే నా ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపించానని బ్రిస్క్‌మ్యాన్ మీడియాకు చెప్పారు.ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో నా రక్తం మరిగిపోయింది.. ముఖ్యంగా కొన్ని రోజుల ముందు హెల్త్ పాలసీ, తదితర కీలకాంశాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చిరాకు తెప్పించాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ట్రంప్ కోసం ఎదురు చూసి హెచ్చరించాను

ట్రంప్ కోసం ఎదురు చూసి హెచ్చరించాను

గత నెల 28వ, తేదిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ కోర్టుకు వస్తారని తెలిసి ఆ దారిలో ఎదురుచూశాను. సరైన సమయంలో నా నిరసనను అలా తెలిపాను. అయితే మీడియాతో పాటు వైట్‌హౌస్ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మాన్ 'నేను వేలు చూపిస్తున్న ఫొటోను' సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నాపేరు మార్మోగిపోయింది. గోల్ఫ్ కోర్టుకు వెళ్లినప్పుడల్లా దీని గురించి అందరూ చర్చించుకోవాలని ఆమె చెప్పారు.

ట్రంప్‌ను హెచ్చరించింది నేనే

ట్రంప్‌ను హెచ్చరించింది నేనే

సోషల్ మీడియాలో ట్రంప్‌ను హెచ్చరిస్తూ తాను పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వివాదం దుమారం రేగుతోంది. ఈ సమయంలో జాతీయ మానవహక్కుల సంస్థకు వెళ్లి ఓ ఉద్యోగిని కలిశాను. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా వేలు చూపించిన మహిళను నేనేనంటూ పరిచయం చేసుకొన్నానని ఆమె చెప్పారు.

కాంట్రాక్టుల కోసం ఉద్యోగం నుండి తొలగింపు

కాంట్రాక్టుల కోసం ఉద్యోగం నుండి తొలగింపు

అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు తమకు రావన్న భయంతో అకీమా అనే కాంట్రాక్టర్ తన వద్ద ఆరునెలలుగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయాలన్నారు. చేసేదేంలేక జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. సోషల్ మీడియాలో తన చర్యను అందరూ మెచ్చుకుంటున్నారని బ్రిస్క్‌మ్యాన్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Juli Briskman found flowers on her doorstep on Monday night. “Juli: I don’t know you and yet I am so proud of you,” an accompanying note said. “You’re my hero. Truly. Thank you for standing up to this admin. We need more like you. Continue to resist. We’re with you all the way. Sally M.”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి