ఎమర్జెన్సీ ల్యాండింగ్: విమానం నుంచి దూకేసిన ప్రయాణీకులు
న్యూయార్క్: అమెరికాలోని అల్బక్వెర్‌క్యూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఓ విమానం అత్యవసరంగా ల్యాండయింది. ఈ సమయంలో ప్రయాణీకులు విమానం నుంచి దూకేశారు.
అరిజోనాలోని ఫోనిక్స్ నుంచి బయలుదేరిన డల్లాస్‌కు చెందిన సౌత్ వెస్ట్ విమానం 3562 అల్బక్వెర్‌క్యూ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. సిబ్బంది క్యాబిన్‌లో ఏదో వాసన వస్తుందని అందుకే విమానం ల్యాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

దీంతో భయభ్రాంతులకు లోనైన ప్రయాణికులు విమానం ల్యాండ్ కాగానే, కొందరు ఒక్కసారిగా విమానం రెక్క పక్కనే ఉండే కిటికిలో నుంచి దూకేశారు. వాళ్లు ఎనిమిది అడుగుల ఎత్తులో నుంచి దూకేశారు. దూకడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications