షాకింగ్: రాయబారి కూతుర్ని కిడ్నాప్ చేసి -తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ దురాగతం -అఫ్గానిస్థాన్ గగ్గోలు
ఇటీవలి చరిత్రలో అరుదైన, షాకింగ్ సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. పాకిస్థాన్ లో అఫ్గానిస్థాన్ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురైంది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న అఫ్గానిస్థాన్.. తాలిబన్లకు మద్దతుగానే పాకిస్తాన్ ఈ దురాగతానికి పూనుకుందని ఆరోపించింది. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు వేగంగా దిగజారిపోతుండగా, తాలిబన్లకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ అఫ్గాన్ ను ఇంకాస్త దిగజార్చే పనిని పాకిస్తాన్ తలకెత్తుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివరాలివి..
పాకిస్తాన్లోని అఫ్గానిస్తాన్ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ అనైతిక సంఘటన పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది.

ఇస్లామాబాద్ లో ఉంటోన్న అఫ్గానిస్థాన్ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కూతురు సిల్సిలా అలీఖీల్ (26) శుక్రవారం సాయంత్రం స్థానిక జిన్నా సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హింసించినట్లు సమాచారం. దుండగుల బారి నుంచి బయటపడి ఇంటికి వచ్చిన సిల్సిలాను స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పొరుగుదేశంలో తమ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురికావడంతో అఫ్గాన్ ప్రభుత్వం.. పాకిస్తాన్లో తమ రాయబార కార్యాలయం అధికారులకు, వారి కుటుంబాలకు రక్షణ కొరవడిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా, అఫ్గాన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు పూర్తి భద్రతను కల్పించేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. నేరస్థులను వీలైనంత త్వరగా గుర్తించి విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. కాగా,
అమెరికా సైన్యాలు పూర్తిగా నిష్క్రమించిన తర్వాతి నిమిషం నుంచే తాలిబన్ సేనలు పేట్రేగుతూ ఒక్కొక్కటిగా అఫ్గానిస్థాన్ లోని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వెళుతున్నారు. ముందుగా పాకిస్తాన్ సరిహద్దులోని కాందహార్ ప్రాంతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటికే తాలిబన్లు పాక్ సరిహద్దును మూసేశారు. పాకిస్తాన్ సైన్యం నుంచి ఆయుధ సహాయం, వాయు సేనల సహాయం తాలిబన్లకు అందుతున్నదని అఫ్గాన్ మంత్రులు ఆరోపిస్తున్నారు.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications