ఘోర ప్రమాదం.. 40 మంది సజీవ దహనం..ఎక్కడంటే..?
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికోలోని సౌత్ స్టేట్ టబాస్కోలో ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కాన్ కన్ నుంచి టబాస్కో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం తెలుసుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 48 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు డ్రైవర్లతోపాటు.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందాడు.

ఈ ఘటనపై కోమల్ కాల్కో మేయర్ ఓవిడియో పెరల్టా స్పందించారు. " ఈ ఘటనపై నేను క్షమాపణలు చెబుతున్నాను. బస్సు కాన్ కన్ నుంచి టబాస్కో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే నా సిబ్బందిని ఘటనా స్థలికి పంపించాను. ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతున్నాయి." అని అన్నారు.
మృతిచెందిన వారి అవశేషాల్లో ఇప్పటివరకు 18మందిని గుర్తించామని.. మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications