టెక్నాలజీతో విసిగిపోయి ఓ మహిళ ఆత్మహత్య

ఈ మెయిల్స్, టీవీలు, కంప్యూటర్స్, సూపర్ మార్కెట్ రెడీమేడ్ మీల్స్ వంటి వాటితో మహిళ తీవ్రంగా విసుగు చెందినట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిది. రాయల్ నేవీ ఇంజనీర్ అయిన మాజీ ఆర్ట్ టీచర్ అన్నీ ప్రపంచ ప్రవాహానికి ఎదురీదడం సరిపోయిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
తను సంపూర్ణ జీవితాన్ని అనుభవించానని, తన జీవితంలో సాహసాలు, విస్తృతమైన స్వేచ్ఛ ఉన్నాయని ఆమె చెప్పింది. ఆస్పత్రిలో, నర్సింగ్ హోమ్‌లో సుదీర్ఘంగా గడపడంతో ఆమె జీవితం పట్ల విసిగిపోయినట్లు ఉంది.
మరణించిన సమయంలో ససెక్స్‌కు చెందిన అన్నీ అనారోగ్యంతో గానీ వికలత్వం గానీ బాధపడలేదని చెబుతున్నారు. మార్చి 27వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications