షాపింగ్‌పై ప్రేయసి నిరాకరణ: ప్రియుడి ఆత్మహత్య

చైనా మీడియా ప్రసారం చేసిన కథనం ప్రకారం... 40ఏళ్ల వయస్సున్న ఆ వ్యక్తి తన ప్రియురాలితో వాగ్వాదం కారణంగా విసుగు చెంది జుజౌ గోల్డెన్ ఈగల్ మాల్ మాల్‌లోని 7వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది.
తన ప్రియురాలు మాటలకు విసిగిపోయిన ప్రియుడు 7వ అంతస్తులోని 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న ఎలివేటర్ నుంచి కింది దూకడంతో మాల్ మధ్యలో ఉన్న కాస్మొటిక్ స్టాండ్‌పై పడి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
తను ఇద్దరు కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో తన వెనక ఏదో కిందపడిన పెద్ద శబ్ధం వినిపించిందని, వెనక్కి తిరిగి చూసే సరికి ఒక మనిషి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్నాడని కాస్మోటిక్ స్టాండ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ప్రియురాలి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.












Click it and Unblock the Notifications