వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్ట్రిషియన్ కొడుకు ఇన్నోవేషన్‌కు అమెరికా కంపెనీ ఫిదా, రూ.70 లక్షల ఉద్యోగం: ఏం చేశాడంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఎలక్ట్రిషియన్ కొడుకు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఎలక్ట్రిషియన్ కొడుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో దాదాపు రూ.70 లక్షల ఉద్యోగం సంపాదించాడు. అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ. అతని తండ్రి సాధారణ ఎలక్ట్రిషియన్.

అలీ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాడు. డిప్లొమాతో అత్యధిక ప్యాకేజీ పొందిన విద్యార్థి అలీయే కావడం గమనార్హం. 2015లో అతను డిప్లొమా పూర్తి చేశాడు.

మహిళ ఎలా బతికిందంటే.. అదృష్టం, అద్భుతం: జారిపడి సముద్రంలోనే 10గం.లుమహిళ ఎలా బతికిందంటే.. అదృష్టం, అద్భుతం: జారిపడి సముద్రంలోనే 10గం.లు

బీటెక్ మధ్యలో ఆపేసి

బీటెక్ మధ్యలో ఆపేసి

చదువుకోవడానికి సరైన స్థోమత లేని అలీ ఇప్పుడు అమెరికాలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం పట్ల అతని కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. అతను ఆర్థిక పరిస్థితుల కారణంగా జార్ఖండ్‌లో బీటెక్ ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తి చేయలేకపోయాడు. కొన్నాళ్ల తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ సిద్ధాంతం

ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ సిద్ధాంతం

తండ్రి ఎలక్ట్రిషియన్ కావడంతో అలీ చిన్నప్పటి నుంచి ఎలక్టిరిక్ పరికరాలకు సంబంధించిన పరిశోధన చేయడం అలవాటుగా మారింది. డిప్లొమా చేస్తూ కూడా తన పరిశోధనలను కొనసాగించాడు. అలా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు సంబంధించి ఒక సిద్ధాంతాన్ని పరిశోధించడం ప్రారంభించాడు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రోత్సాహం

అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రోత్సాహం


మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్ వాహనాల హవా ప్రారంభమవుతోంది. తాను పరిశోధించిన సిద్ధాంతం విజయవంతం అయితే కనుక ఖర్చు లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేయవచ్చునని అలీ చెబుతున్నాడు. తన ప్రతిభను ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుర్తించి, సహాయం చేశాడని చెప్పారు.

సీఐఈ వెబ్ సైట్లో పెట్టారు

సీఐఈ వెబ్ సైట్లో పెట్టారు

తన పరిశోధనకు సంబంధించిన ప్రోటోటైప్‌ను తాను చదివిన, తండ్రి ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న స్కూల్లో ప్రదర్శించాడు. అందరూ అభినందించారు. దీనిని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌ (సీఐఈ)కి పంపించాడు. దీనిని సీఐఈ డైరెక్టర్ తమ వెబ్‌సైట్లో పెట్టాడు.

అమెరికా సంస్థ చూసి ఫిదా

అమెరికా సంస్థ చూసి ఫిదా


అమెరికాకు చెందిన ఫ్రిస్సన్ మోటార్ వర్క్స్ అనే ఆటో మొబైల్ సంస్థ ఆ ప్రొటోటైప్‌ను చూసింది. దాని పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే సీఐఈ ద్వారా అతని గురించి తెలుసుకొని, తమ కంపెనీలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఎంతో ఆనందించాడు. తన కొడుకు చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపడ్డాడని, ఇప్పుడు ఆ కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందన్నాడు.

English summary
Mohammad Aamir Ali, son of an electrician, bagged a job in an American firm with a package of around $100,000 (Rs 70 lakh approximately). Ali pursued a diploma in Mechanical engineering at Jamia Milia Islamia (JMI) in Delhi. He is the only diploma holder to get a job with such a high package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X