వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: భారీగా గాలులకు ఈ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందో చూడండి..!

|
Google Oneindia TeluguNews

లండన్: లండన్‌ను గాలి తుఫాను వణికిస్తోంది. డెన్నిస్ తుఫాను ధాటికి అక్కడ గాలులు అతి వేగంగా వీస్తున్నాయి. ఎంతలా అంటే ఒక భారీ విమానంను కూడా తన వేగంతో గతితప్పేలా వీస్తున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక్కడ కూడా ఓ భారీ విమానం డెన్నిస్ తుఫాను ధాటికి గతి తప్పింది. ఈ ఘటన హాత్రో విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

 బ్రిటన్‌ను వణికిస్తున్న డెన్నిస్ తుఫాను

బ్రిటన్‌ను వణికిస్తున్న డెన్నిస్ తుఫాను

బ్రిటన్‌ను డెన్నిస్ తుఫాను వణికిస్తోంది. ఈ ప్రభావం అక్కడి విమాన సర్వీసులపై పడుతోంది. ఇక హీత్రో విమానాశ్రయంలో ఓ భారీ జంబో జెట్ అసాధరణ రీతిలో ల్యాండింగ్ అయ్యింది. అప్పటికే పెనుగాలులు వీస్తుండగా ఎతిహాద్ విమానాయాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం ల్యాండ్ అయ్యేందుకు చిన్నగా విమానాశ్రయంలోకి దిగుతోంది. అదే సమయంలో భారీగా గాలులు వీస్తున్నాయి. ఇక విమానం పైలట్ మాత్రం సాహసం చేసేశాడు. విమానం అసాధరణ రీతిలో ల్యాండ్ అయ్యింది. రన్‌వేపై స్మూత్‌గా ల్యాండ్ కావాల్సిన విమానంపై భారీ గాలులు ప్రభావం చూపాయి.

భారీ గాలులు వీయడంతో గతి తప్పిన ఎయిర్ బస్

విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భారీగా గాలులు వీయడంతో విమానం గతి తప్పింది. చక్కగా ల్యాండ్ కాకుండా పక్కకు ఒరుగి విమానం ల్యాండ్ అవుతూ కనిపించింది. అయితే లోపల ప్రయాణికులంతా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. గాలుల ధాటికి విమానం పక్కకు ఒరిగినప్పటికీ ల్యాండింగ్ మాత్రం విజయవంతంగా పూర్తవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలి తుఫాను కారణంగా కొన్ని వందల విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. కానీ ఎతిహాద్ విమానం మాత్రం ల్యాండింగ్‌కు ఎలా అనుమతిచ్చారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Recommended Video

Viral Video : Elephants Eating Sugarcane In The Truck, Video Goes Viral | Oneindia Telugu
నెలరోజులు కురిసే వర్షం ఒక్క రెండ్రోజుల్లోనే...

నెలరోజులు కురిసే వర్షం ఒక్క రెండ్రోజుల్లోనే...

ఇక ఇలాంటి బీభత్సమైన తుఫాను యూకేను తాకడం ఇది గత కొన్ని వారాల్లో రెండో సారి. తుఫాను ధాటికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా నెలరోజుల పాటు కురిసే వర్షం కేవలం రెండు రోజుల్లోనే కురిసింది. దీంతో మొత్తం ఇంగ్లాండ్‌కు వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటి వరకు 594 హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.ఇక వేల్స్‌లో మాత్రం నెలరోజుల్లో కురిసే వర్షం ఒక్క శుక్రవారం శనివారాల్లో మాత్రమే కురిసినట్లు చెప్పారు.

English summary
A plane pulled off an extraordinary landing at Heathrow Airport, after contending with powerful headwinds brought by Storm Dennis in Britain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X