భారత ఎంబసీపై దాడికి యత్నం: పాక్ మద్దతుదారులపై యూకే ఆగ్రహం

లండన్: భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది. యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్థాన్ మద్దతుదారులు నిరసన చేపట్టి, దాడికి యత్నించడాన్ని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

భారతీయులోపాటు ఏ ఇతర వర్గానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు చేస్తే సహించమని హెచ్చరించారు. మంగళవారం జరిగిన బ్రిటిష్ పార్లమెంటులో డామినిక్ రాబ్ మాట్లాడుతూ.. వర్గాల మధ్య ఘర్షణలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Deplorable: UK Foreign Secretary On Violence Outside Indian Embassy

లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా పాక్ మద్దతుదారుల నిరసనను ఖండించారు. కాగా, మంగళవారం భారత హైకమిషన్ ఎదుట నిరసనకు దిగిన పాకిస్థాన్ మద్దతుదారుల్లో ఇద్దరిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని నిరసిస్తూ యూకేలోని భారత హై కమిషన్ కార్యాలయం వద్ద పాక్ మద్దతుదారులు మంగళవారం నిరసన చేపట్టారు. ఎంబసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను భారత హై కమిషన్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+