షాకింగ్: రెస్టారెంట్‌లో 2గ్లాసుల నీళ్లు ఆర్డర్ చేసి రూ. ఏడున్నర లక్షలు టిప్ ఇచ్చాడు!

గ్రీన్‌విల్లే: సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో భోజనం తర్వాత వెయిటర్లకు టిప్ ఇస్తుంటాం. కానీ, రూ. వందలకు మించి టిప్ ఇవ్వడం అయితే జరగదు. కానీ, ఇక్కడ ఓ కస్టమర్ మాత్రం ఏకంగా రూ. ఏడున్నర లక్షలు టిప్ ఇవ్వడం గమనార్హం. అది కూడా 2 గ్లాసుల మంచినీళ్లు ఆర్డర్ ఇచ్చి కావడం గమనార్హం.

 రెండు గ్లాసుల నీళ్లు ఆర్డర్

రెండు గ్లాసుల నీళ్లు ఆర్డర్

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్‌విల్లే సూప్ డాగ్స్ రెస్టారెంట్‌కి
మిస్టర్ బీస్ట్ అనే వ్యక్తి వెళ్లాడు. ముందుగా రెండు గ్లాసుల నీళ్లు ఆర్డర్ చేశాడు. ఆ టేబుల్ వెయిటర్ అలైనా కస్టర్.. వెంటనే రెండు గ్లాసుల్లో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ తర్వాత వెయిటర్ కస్టర్ మళ్లీ లోపలికి వెళ్లింది. మెనూ చూస్తూ అతను నీళ్లు తాగేశాడు.

 టిప్‌గా... ఏడున్నర లక్షలు

టిప్‌గా... ఏడున్నర లక్షలు


ఆ తర్వాత కొద్ది క్షణాలకు ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు వెయిటర్ మళ్లీ టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చింది. వచ్చి చూసేసరికి ఆ టేబుల్ మీద వందల డాలర్ల నోట్లు కొన్ని కనిపించాయి. ఆ నోట్లను చూసి కస్టర్ ఆశ్చర్యపోయింది. వాటిని లెక్కపెట్టగా.. పదివేల డాలర్లు(సుమారు రూ.ఏడున్నర లక్షలు) ఉన్నట్లు గుర్తించింది.

రుచికరమైన మంచినీళ్లు..

రుచికరమైన మంచినీళ్లు..


కాగా, ఆ టేబుల్‌పై అతను ఏదో రాసినట్లు గుర్తించిన వెయిటర్ దాన్ని పరిశీలనగా చదివింది. రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతడు ఆ న్యాప్‌కిన్‌పై రాశాడు. వెయిటర్ కస్టర్ అది చదివి మరోసారి ఆశ్చర్యానికి గురైంది.

వెయిటర్ షాక్..

వెయిటర్ షాక్..

రెండు గ్లాసుల మంచినీళ్లు తాగి తనకు పదివేల డాలర్ల టిప్ ఇచ్చారా? అంటూ షాకైంది. కాగా, మిస్టర్ బీస్ట్ ఓ యూట్యూబ్ స్టార్. అతని అసలు పేరు జిమ్మి డోనాల్డ్‌సన్. అతనికి 90లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను అప్పుడప్పుడు ఇలా గుర్తుతెలియని వ్యక్తులకు ఖరీదైన కానుకలిస్తు ఆశ్చర్యపరుస్తుంటాడు.

యూట్యూబ్ స్టార్..

యూట్యూబ్ స్టార్..

తాజాగా వెయిటర్ కస్టర్‌ను కూడా అతను తన టిప్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, కస్టర్ తనకు వచ్చిన టిప్‌ను చూసి నిర్ఘాంతపోయిన సందర్భాన్ని అతని టీమ్ వీడియో తీసింది. ఇలాంటి వీడియోలు అతని యూట్యూబ్ పేజీలో చాలానే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+