Corona Vaccine:ఆ టీకా తీసుకున్న డాక్టర్‌కు అలెర్జీ.. గుండె వేగంగా కొట్టుకుందట..!

కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తుండటం కాస్త ఊరటనిచ్చే విషయమైనప్పటికీ... కొన్ని వ్యాక్సిన్‌లో లోపాలు ఉండటం మరింత కలవరపెడుతోంది. అవును కరోనావైరస్ కట్టడికి ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌లను కనిపెట్టాయి. అయితే ట్రయల్స్ సందర్భంగా కొన్ని వ్యాక్సిన్‌లు కచ్చితత్వంతో పనిచేస్తున్నాయా అనేదానిపై స్పష్టత లేదు. కొన్ని వ్యాక్సిన్‌లు 90 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంటే మరికొన్ని టీకాలు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి. తాజాగా అమెరికాలో తయారైన మోడెర్నా టీకా కూడా ఈ కోవలోకే వస్తుంది.

 మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టరు

మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టరు

అగ్రదేశం అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో ఎమర్జెన్సీ వినియోగం కోసం పలు టీకాలకు ఆమోద ముద్ర వేసింది అమెరికా ప్రభుత్వం. ఇందులో మోడెర్నా టీకా ముఖ్యమైంది. మోడెర్నా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చిన మొదటి వారంలోనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న వార్త అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలోని ఓ వైద్యుడికి మోడెర్నా టీకా ఇవ్వడంతో వెంటనే అతనిలో అలెర్జీ కనపించినట్లు ఆ దేశ ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రచురించింది. అంతేకాదు టీకా తీసుకున్న వైద్యుడి గుండె వేగంగా కొట్టుకుందని ఆ కథనం పేర్కొంది.

 ఎమెర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స

ఎమెర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స

డాక్టర్ సద్రజాదే అనే వైద్యుడికి మోడెర్నా టీకా ఇవ్వడంతో వెంటనే అతనిలో అలర్జీ లక్షణాలు కనిపించాయని దీంతో ఆయన్ను ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు తరలించి అక్కడ చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. చికిత్స తీసుకున్నాక డాక్టర్ సద్రజాదే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్ఛార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గత వారం ఎమెర్జెన్సీ ప్రాతిపదికన ఫైజర్ సంస్థకు చెందిన ఫైజర్ అండ్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ పలువురికి ఇవ్వడంతో వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. దీంతో అలెర్జీ రియాక్షన్స్‌పై ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించిన కొద్ది రోజులకే అధికారిక మోడెర్నా వ్యాక్సిన్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారికి నిద్ర లేకుండా చేస్తోంది.

 అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న కరోనా..

అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న కరోనా..

ఇదిలా ఉంటే అమెరికాను కరోనావైరస్ కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే వైరస్‌కు టీకాలు వచ్చేశాయన్న వార్త అక్కడి దేశస్తులకు కాస్త రిలీఫ్ ఇచ్చినప్పటికీ వచ్చిన టీకాల్లో లోపాలు ఉన్నాయన్న వార్త తెలియగానే అమెరికన్లు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏ మేరకు సీరియస్‌గా ఉన్నాయో అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్‌ కూడా భయానికి మరో కారణంగా నిలిచింది. ఇదంతా అటుంచితే అమెరికాలో ఇప్పటి వరకు 338,263 మంది కరోనా బారిన పడి మృతి చెందగా...19,210,166 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+