అమెరికా నుంచి వెళ్లిపోతున్న ఉద్యోగులు: ఆఫీసులన్నీ ఖాళీ: అనూహ్య పరిణామాలు
Donald Trump: భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేసిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన కార్యాలయాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఉద్యోగులు పెట్టే బేడా సర్దుకుంటోన్నారు. స్వదేశాలకు తిరుగుముఖం పడుతున్నారు.
యూఎస్ఎయిడ్ కింద వివిధ దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ అందజేస్తూ వచ్చిన నిధులను డొనాల్డ్ ట్రంప్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పైనా ఆయన సంతకం పెట్టారు. యూఎస్ఎయిడ్ ఉద్యోగులనూ తొలగించారు. 15 నిమిషాల్లో ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

ఫలితంగా యూఎస్ఎయిడ్ ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. కార్యాలయాలను ఖాళీ చేశారు. ఈ తొలగింపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) సమర్థించుకుంది. తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండింగ్‌ను ఆపివేయాల్సి వచ్చిందనీ వివరించింది.
మొత్తంగా 4,080 మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులు అమెరికా సహా వేర్వేరు దేశాల్లో వివిధ హోదాల్లో పని చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 1,600 మంది వర్కర్లు ఇందులో విధులను నిర్వర్తిస్తూ వస్తోన్నారు. ఈ విభాగంలో పని చేస్తోన్న ఉద్యోగులందరినీ తొలగించారు డొనాల్డ్ ట్రంప్. తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశించారు.
ఉద్యోగులు కార్యాలయాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్న సమయంలో పలువురు స్థానికులు వారికి వీడ్కోలు పలికారు. సొంబ్రె నెగ్రా గ్రూప్ సభ్యులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ని సంవత్సరాల పాటు నిస్వార్థంగా సేవలను అందించినందుకు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ సహా మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులను ఇటీవలే రద్దు చేసింది డోజ్.












Click it and Unblock the Notifications