వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొక్లాం, ధీటుగా భారత్: ఇంటా-బయట.. ఇదీ జీ జిన్‌పింగ్ వ్యూహం

ఇటీవల డొక్లాం వద్ద భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థుతులు చోటు చేసుకున్నాయి. చివరకు ఇరు దేశాలు యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ణయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఇటీవల డొక్లాం వద్ద భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థుతులు చోటు చేసుకున్నాయి. చివరకు ఇరు దేశాలు యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ణయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

భారత్ లోకి డేంజర్ డ్రగ్.. 'చైనా వైట్'.. మార్ఫిన్, హెరాయిన్ కన్నా వంద రెట్లు పవర్ ఫుల్! భారత్ లోకి డేంజర్ డ్రగ్.. 'చైనా వైట్'.. మార్ఫిన్, హెరాయిన్ కన్నా వంద రెట్లు పవర్ ఫుల్!

అయితే తాజాగా డోక్లాంకు సమీపంలోనే చైనా తన రహదారి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడంతో భారత రక్షణ వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న వ్యూహంలోనే భాగంగా చైనా దూకుడు కొనసాగుతోందని అనుమానిస్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో చైనా ఎక్స్‌ప్రెస్ వే, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో చైనా ఎక్స్‌ప్రెస్ వే, ఎందుకంటే

పార్టీలో పట్టుకోసం

పార్టీలో పట్టుకోసం

చైనా కమ్యూనిస్టు పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ నెలలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్నాయి. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు వీలుగా డోక్లాంను మళ్లీ తెరపైకి తీసుకువచ్చినట్టుగా భావిస్తున్నారు.

అదీ వ్యూహం

అదీ వ్యూహం

చైనాను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న వ్యూహంలో భాగంగా డోక్లాం సమస్యపై ఎటువంటి రాజీపడేది లేదన్నది చైనీయులకు వెల్లడించాలన్నదే జీ జిన్‌పింగ్‌ అభిమతంగా చెబుతున్నారు. తద్వారా వ్యక్తిగతంగా తాను పట్టు సాధించాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

చైనా అనుమానం

చైనా అనుమానం

చైనాను నెంబర్‌ వన్‌ స్థానానికి చైనాను తీసుకువెళ్లాలన్నది జీ జిన్‌పింగ్‌ ఆలోచన. డోక్లాం రూపంలో భారత్‌ అడ్డుగోడగా నిలవడం ఆయనకు మింగుడుపడని అంశం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో జపాన్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, సింగపూర్‌, ఇండోనేషియా, అమెరికా దేశాలతో కలిసి భారత్‌ తమను నిలువరించవచ్చని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో డొక్లాం ఇష్యూను మరోసారి తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.

ధీటుగా జవాబిస్తున్న భారత్‌...

ధీటుగా జవాబిస్తున్న భారత్‌...

చైనాకు ధీటుగా భారత్ కూడా స్పందిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు లడక్ ప్రాంతంలోనూ సరిహద్దు వెంబడి భారత్‌ మౌలిక సౌకర్యాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధం జరిగితే వెంటనే దళాల తరలింపునకు ఇది అనువుగా ఉంటుంది. డోక్లాం ప్రాంత భూటాన్‌కు చెందినది. అయితే గత ఒప్పందాల ప్రకారం భూటాన్‌ రక్షణ బాధ్యతలు భారత్‌ నిర్వహిస్తోంది. అందుకే చిన్నదేశం భూటాన్‌కు చెందిన డోక్లాంలో చైనా కాలుమోపకుండా భారత్‌ గట్టిచర్యలు తీసుకుంది. దీంతో పాటు చైనా ఎత్తులకు భారత్‌ పైఎత్తులు వేస్తుండటంతో చైనాకు మింగుడుపడటం లేదు.

స్వదేశంలోను పోటీ

స్వదేశంలోను పోటీ


మరోవైపు, చైనా కమ్యూనిస్టు పార్టీలో జియాంగ్‌ జెమిన్‌ మద్దతుదారుల నుంచి జీ జిన్‌పింగ్‌కు సవాల్‌ ఎదురవుతోంది. ఇంటా బయటా ఎదురవుతున్న సమస్యల నుంచి డోక్లాం రూపంలో దృష్టి మళ్లించి స్వదేశంలోనూ తిరుగులేని నేతగా ఎదగాలనేది జీ జిన్‌పింగ్‌ లక్ష్యంగా భావిస్తున్నారు.

English summary
China’s decision to deploy a large contingent of its troops near Dokalam along Sino-Bhutan boundary has brought back memories of the July-August standoff which experts believed was triggered by President Xi Jinping’s attempts to consolidate his position and project power while seeking to thwart India’s geopolitical objectives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X