వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ గగనతలం వాడొద్దు, ఉగ్ర దాడులు చేసే ఛాన్స్, వాణిజ్య, ప్యాసెంజర్ ప్లైట్లకు అమెరికా ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌కు స్నేహహస్తం అందించే అమెరికా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ దేశంతో సాన్నిహితంగా ఉంటూనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల నుంచి అమెరికాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. నిఘా సంస్థల హెచ్చరికలతో అమెరికా మరింత అప్రమత్తమైంది.

న్యూ ఇయర్ సందర్భంగా కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన వాణిజ్య, అమెరికా ప్యాసెంజర్ విమానాలు పాకిస్థాన్ గగనతలం ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. పొరపాటున పాకిస్థాన్ గగనతలం ఉపయోగిస్తే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, అతివాదుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్ గగనతలాన్ని పొరపాటున కూడా ఉపయోగించొద్దని జనవరి 1వ తేదీన ఆదేశాలు జారీచేసింది.

 don’t use pakistan airspace, america warns us airlines

అమెరికాకు చెందిన అన్ని వాణిజ్య, ప్యాసెంజర్ విమానాలకు ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నది. అమెరికా పౌరవిమానయాన సంస్థ అనుమతి ఇచ్చిన అన్ని విమానాలకు ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అమెరికాకు వచ్చే విదేశాలకు చెందిన విమానాలకు మాత్రం ఆదేశించలేమని తెలిపింది.

ఒకవేళ పాకిస్థాన్ గగనతలం ఉపయోగించిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్న ఫలితం ఉండబొదని చెప్పారు. తక్కువ ఎత్తులో ప్రయాణించిన సమయంలో గానీ, విమానం దిగే సమయంలో గానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి అమెరికాకు ముప్పు ఉందని. చిన్న ఆయుధాల నుంచి ఎయిర్ పోర్టులలో దాడుల చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.

English summary
United States warns its air carriers to avoid Pakistan airspace, it may be a risk & possible threat of attacks on us airlines by Pakistan extremist & militant groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X