ముస్లీంలు అటవికులుగా మారుతున్నారు: డొనాల్డ్
మియామి: అమెరికా రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలరు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు క్రూరంగా తయారవుతున్నారని ధ్వజమెత్తారు. వారు రోజురోజుకు ఆటవికులుగా తయారవుతున్నారన్నారు.
ఇతర వర్గాలకు ప్రమాదకరమవుతున్నారని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పైన విమానాలతో ఉగ్రవాదులు దాడులు చేసిన సమయంలో ఎంతో మంది ముస్లింలు వాటిని సమర్థించారన్నారు. ముస్లీంలు ఆటవికంగా మారుతున్నారన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారన్నారు.

ఇస్లాం మతాన్ని ఆచరించడమే ధ్యేయంగా పెట్టుకున్న యాసర్ అరాఫత్, లిబియాలో నియంతగా పేరుపడ్డ గడాఫీలు సైతం ఉగ్రవాదాన్ని పెంచాలని భావించలేదన్నారు. వారు అమెరికా పైన దాడిని ఖండించారన్నారు. 9/11 దాడులను సమర్థించేవారు ఓ సారి చరిత్రను తిరగేయాలని హితవు పలికారు.
ఆయన మియామీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. ఇతను అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఫ్లోరిడా, సరసోటాల్లో నిర్వహించిన ప్రచార సభల్లోను అతను ముస్లీం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నివసిస్తున్న అరబ్, ముస్లీంల వివరాలు సేకరించాలనే డిమాండును నేను సమర్థిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications