భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఆ ఉత్పత్తులపై 500 శాతం పన్ను?

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించేందుకు సిద్ధమైన వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల ఉత్పత్తులపై ఏకంగా 500 శాతం సుంకాలు (దిగుమతి సుంకాలు) విధించే ప్రతిపాదనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

లిండ్సే గ్రాహం బిల్లుకు ట్రంప్ మద్దతు
రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన 'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025' బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి చమురు, గ్యాస్, యురేనియం వంటి ఇంధన వనరులను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును రూపొందించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం సుంకం విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.

Donald Trump Big Shock to India Proposal for 500 Tariff on Countries Buying Russian Oil

వచ్చే వారమే ఓటింగ్
సెనెటర్ లిండ్సే గ్రాహం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుపై వచ్చే వారమే సెనెట్‌లో ఓటింగ్ జరగనుంది. "పుతిన్ యుద్ధ యంత్రానికి నిధులు సమకూరుస్తున్న దేశాలను శిక్షించేందుకు ఈ బిల్లు ట్రంప్‌కు పూర్తి అధికారాన్ని ఇస్తుంది" అని గ్రాహం పేర్కొన్నారు.

భారత్‌పై ప్రభావం ఏమిటి?
భారత్ ప్రస్తుతం రష్యా నుంచి భారీగా రాయితీ ధరకే ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం వరకు టారిఫ్‌లను విధించింది. ఒకవేళ ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐటీ సేవలు, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 500 శాతం టారిఫ్ అంటే అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, పోటీలో వెనుకబడతాయి. రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడం భారత విదేశాంగ శాఖకు పెద్ద పరీక్షగా మారనుంది.

ట్రంప్ కామెంట్స్
ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "భారత్ రష్యాతో వ్యాపారం చేస్తోంది.. మేము వారిపై చాలా త్వరగా టారిఫ్‌లను పెంచగలం" అని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+