అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు అణు ఆయుధాలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తాము కోరుకున్న దేనిపైనైనా నియంత్రణ కలిగి ఉంటామని స్పష్టం చేశారు. నాలుగు వారాల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో తాము గెలిచామని ప్రకటించుకున్నారు. యుద్ధాన్ని ముగించడానికి తమతో సాగిస్తోన్న శాంతి చర్చల్లో పురోగతి నెలకొందని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన 15 షరతుల్లో మెజారిటీ అంశాలను ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు.
తాజాగా ఆయన వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎక్కువ ప్రాణాలు పోకుండా ఈ యుద్ధాన్ని గెలిచామని అన్నారు. 10 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే విద్యుత్ ప్లాంట్లను నాశనం చేయకుండా దీనిని ముగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే మొదటి షరతుతో చర్చలు కొనసాగుతున్నాయని, దీనికి ఆ దేశ ప్రతినిధులు అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇకపై ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండబోవని అన్నారు.

ఇరాన్ తో బేరసారాల్లో తమదే పైచేయి అని ఓ ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. తాము అనుకున్న డ్యూల్ కంటే త్వరగానే చర్చలు ముగిసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించే శక్తి సామర్థ్యాలు ఇరాన్ కు లేవని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆ దేశం నౌక, వైమానిక దళాలను కోల్పోయిందని, క్షిపణి రక్షణ వ్యవస్థ చెల్లాచెదురు అయిందని వివరించారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య ఇరాన్‌తో చర్చలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించగా శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, ఓ బహుమతి సైతం పంపారని అన్నారు. ఆ బహుమతి చాలా విలువైనదిగా అభివర్ణించారు ట్రంప్. అలాగే దాని ధర కూడా చాలా ఎక్కువేనని, పెట్రోలియం, గ్యాస్‌కు సంబంధించినదని హింట్ ఇచ్చారు. ఇరాన్ నాయకత్వం కనుమరుగైందని, కొత్త సుప్రీం లీడర్ తమకు సహకరించే ప్రయత్నాల్లో ఉన్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఇరాన్ నిరంకుశ నాయకత్వాన్ని తాము అంతం చేయగలిగామని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రస్తుత ఇరాన్ నాయకత్వం గతంలో కంటే చాలా భిన్నంగా తమతో వ్యహరిస్తోన్నారని, వివేకంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే తొలి మూడు షరతులకు ఇరాన్ అంగీకరించిందని ప్రశంసించారు. మిగిలిన వాటిపై సానుకూల స్పందన వస్తే ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు.
తమకు అనుకూలంగా వ్యవహరించే కొత్త నాయకత్వం ఇరాన్ లో ఉందని ట్రంప్ అన్నారు. పాలనలో సంభవించిన మార్పుగా ఆయన పేర్కొన్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పైనా అక్కడి నాయకత్వం సానుకూలంగా ఉండటం శుభసూచకమని, సరైన వ్యక్తులతో తాము చర్చిస్తోన్నామనడానికి ఇది ఉదాహరణ అని చెప్పారు. అయినప్పటికీ తాను ఎవరినీ నమ్మనని ఇరాన్ ను కూడా విశ్వసించబోనని తేల్చి చెప్పారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?











Click it and Unblock the Notifications