అమెరికా భారతీయులకు పెద్ద ఊరట: 7.5 లక్షల మందికి ఉపశమనం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలో పని చేస్తోన్న 7.5 లక్షల మంది భారతీయులకు పెద్ద ఊరట. వారికి ఉపశమనం కలిగిస్తూ అమెరికా శుభవార్త అందించింది. హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం లేదని, వీసా పొడిగింపు నిబంధనల్లో మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాను ఆరేళ్లకు మించి పొడిగించకుండా, సెక్షన్ 104 సీలో మార్పులు చేయాలని మొదట భావించింది. దీనిపై వ్యతిరేకత రావడంతో తమ నిర్ణయంపై తగ్గింది. ఈ మేరకు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన చేసింది. దీంతో అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకు ఉన్న హెచ్1బీ వీసాలను పొడిగించుకునే అవకాశం ఉంది.

బలవంతంగా పంపించే నిబంధనలను పరిగణలోకి తీసుకోదు

బలవంతంగా పంపించే నిబంధనలను పరిగణలోకి తీసుకోదు

వేలాది మంది హెచ్1బీ వీసాదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ఎలాంటి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోబోమని అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం సోమవారం వెల్లడించింది. ఈ ప్రకటనతో గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న అక్కడి భారతీయ హెచ్1బీ వీసాదారులకు ఊరట లభించింది. వీసా పొడిగింపు నిరాకరించి వేలాది మంది హెచ్1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ పరిగణలోకి తీసుకోదని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి వెల్లడించారు.

మరో ఏడాది పొడిగింపుకు అలా అవకాశం

మరో ఏడాది పొడిగింపుకు అలా అవకాశం

ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్ 104(సీ) ప్రకారం హెచ్1బీ వీసాదారులకు ఆరేళ్లకు పైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ మార్పులు ఏదైనా జరిగినా హెచ్1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా కంపెనీలు అభ్యర్థించే అవకాశముందని తెలిపారు.

అందరి నుంచి వ్యతిరేకత

అందరి నుంచి వ్యతిరేకత

హెచ్1బీ వీసాలపై పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకున్న అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసా మార్పుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ యంత్రాగంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఈ వీసాల పొడిగింపును ఆపాలనే ప్రతిపాదనను ఇప్పటికే కొందరు అమెరికా శాసనకర్తలు, న్యాయవాద బృందాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

7.5 లక్షల మందికి ఊరట

7.5 లక్షల మందికి ఊరట

దీని వల్ల 7.5లక్షల భారత అమెరికన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని, దీంతో అమెరికాలో తీవ్ర నిపుణుల కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్‌ యంత్రాంగం హెచ్1బీ వీసాల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The US authorities today said that the Trump administration is not considering any proposal in its H1-B visa policies that will force the holders to leave the country, reported PTI.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి