వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్వవైభవం తెస్తా: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ ప్రజల కలలను సాకారం చేస్తానని అన్నారు. ఇది అందరం కలిసి పని చేయాల్సిన సమయమని అమెరికన్లకు పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ నేను అధ్యక్షుడినేనని అన్నారు. మనమంతా నూతన అమెరికాను నిర్మిద్దామని అన్నారు.

ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చాలా కష్టపడ్డారని అన్నారు. ఫలితాల అనంతరం హిల్లరీ క్లింటన్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని ట్రంప్ చెప్పారు. మనతో కలిసి వచ్చే దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటామని చెప్పారు. మనమెప్పుడూ అగ్రరాజ్యమేనని, మనకు నెంబర్ 2 ఆలోచనే లేదని అన్నారు.

Donald Trump elected as New US President.

తనను గెలిపించిన అమెరికన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్. తాను ఈ స్థాయికి చేరుకునేందుకు కారణమైన తన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య, కుమారుడు, కూతురు, సోదరుడు ర్యాపిడ్ కూడా ఎంతో సహకరించారని అన్నారు.

ఇది చరిత్రాత్మక విజయమని ట్రంప్ అన్నారు. తాను దేశం కోసం అంకిత భావంతో పని చేస్తానని చెప్పారు. ఈ విజయం అమెరికన్ ప్రజలకు అంకితమని అన్నారు. తాను దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాని చివరి చెప్పి ప్రసంగాన్ని ముగించారు. కాగా, ట్రంప్ ప్రసంగిస్తుండగా.. హుర్రే హే అంటూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు.

English summary
Donald Trump elected as New US President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X